India vs Australia: ఫించ్ అరుదైన ఘనత.. రెండో ఆసీస్ ప్లేయర్‌గా రికార్డుల్లోకి!!

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ మరో మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో ఐదు వేల పరుగులు సాధించిన ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు. శుక్రవారం సిడ్నీలో భారత్‌తో ప్రారంభమైన తొలి వన్డేలో ఫించ్ ఆ రికార్డును సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఆరో ఓవర్ ఐదవ బంతికి సింగల్ తీసిన ఫించ్.. ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఫించ్‌కు ఇది 130వ వన్డే. అతని కెరీర్ సగటు 40.98గా ఉంది. వన్డేల్లో ఫించ్ మొత్తం 16 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు చేశాడు.

ఫించ్@5K
వన్డేల్లో 5వేల పరుగుల మైలురాయిని దాటిన ఆస్ట్రేలియా క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. ఆ ప్లేయర్ల జాబితాలో రికీ పాంటింగ్, ఆడం గిల్‌క్రిస్ట్, మార్క్ వా, మైఖేల్ క్లార్క్, స్టీవ్ వా, మైఖేల్ బేవన్, అలెన్ బోర్డర్, మాథ్యూ హేడెన్, డీన్ జోన్స్, బూన్, షేన్ వాట్సాన్, మైఖేల్ హస్సీ, క్రిస్ మార్టిన్, డేవిడ్ వార్నర్, ఆండ్రూ సైమండ్స్ ఉన్నారు. ఆరోన్ ఫించ్ కేవలం 126వ ఇన్నింగ్స్‌లో 5వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. వార్నర్ ఈ ఘనతను కేవలం 115 మ్యాచుల్లోనే అందుకున్నాడు.

రెండో ఫాస్టెస్ట్ ఆసీస్ ప్లేయర్‌గా
వన్డేల్లో 5 వేల మార్క్‌ను దాటిన రెండవ ఫాస్టెస్ట్ ఆసీస్ ప్లేయర్‌గా ఆరోన్ ఫించ్ నిలవడం విశేషం. డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 115 మ్యాచుల్లోనే 5 వేల మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఆరోన్ ఫించ్ (126), డీన్ జోన్స్ (128), మాథ్యూ హేడెన్ (132), మైఖేల్ బేవన్ (135) లు టాప్-5లో ఉన్నారు. ఈ మ్యాచులో ఫించ్ హాఫ్ సెంచరీ చేశాడు. 69 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. వన్డేల్లో అతనికి ఇది 28వ అర్ధ శతకం.

జోరుమీదున్న ఓపెనర్లు
తొలి వన్డేలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ జోరుమీద ఆడుతున్నారు. భారత బౌలర్లను ధాటికి ఎదుర్కుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు 22 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 118 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్ 81 బంతుల్లో 56 పరుగులు చేయగా.. వార్నర్ 52 బంతుల్లో 48 పరుగులు సాధించాడు. వార్నర్ దూకుడుగా ఆడుతూ బౌండరీలు సాధిస్తున్నాడు.

రెట్రో డ్రెస్‌లతోనే
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ నిబంధనల నడుమ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. 1992 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు ధరించిన జెర్సీని పోలిన (రెట్రో) డ్రెస్‌లతోనే బరిలోకి దిగటం ఆకర్షణీయాంశం.ఇక ఐపీఎల్‌లో రాణించి భారత ఆటగాళ్లకు ఈ మ్యాచ్‌లో చోటుదక్కింది. మయాంక్ అగర్వాల్‌తో పాటు పేసర్ నవదీప్ సైనీ సైతం తుది జట్టులో చోటుదక్కించుకున్నారు. శిఖర్ ధావన్‌తో కలిసి మయాంక్ ఇన్సింగ్స్‌ను ప్రారంభినున్నాడు.
India vs Australia: టెస్టు సిరీస్ నుంచి ఇషాంత్ ఔట్.. సన్‌రైజర్స్ బౌలర్‌కు చోటు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications