Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: వార్న‌ర్‌, ఫించ్‌ హాఫ్ సెంచ‌రీలు.. భారీ స్కోరుపై కన్నేసిన ఆస్ట్రేలియా!!

India vs Australia: Aaron Finch and David Warner hits Half Centurys

సిడ్నీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ అదరగొడుతున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాది పరుగుల వరద పారిస్తున్నారు. ఫించ్ 69 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. వ‌న్డేల్లో అతనికి ఇది 28వ అర్ధ శతకం. మరోవైపు వార్నర్ 55 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. వన్డేల్లో వార్నర్ 22వ హాఫ్ సెంచరీ చేశాడు. ఇద్దరూ కలిసి 150పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరుపై కన్నేసింది.

తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. ఇన్నింగ్స్ ఆదిలో వార్నర్, ఫించ్ ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్నాక మాత్రం ఇద్దరూ బ్యాట్ జులిపించారు. 38 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదాన్ని ఫించ్ తప్పించుకున్నాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ విసిరిన వైడ్ డెలివరీని వెంటాడిన ఫించ్.. బంతిని గాల్లోకి లేపాడు. శిఖర్ ధావన్ క్యాచ్ అందుకునేందుకు ముందుకు దూకినప్పటికీ.. బంతి అతడికి అందలేదు. కాసేపటికే ఫించ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోకొద్దిసేపటికి వార్నర్ కూడా 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. అయితే మొహమ్మద్ షమీ 28వ ఓవర్లో వార్నర్‌ను ఔట్ చేసి టీంఇండియాకు బ్రేక్ ఇచ్చాడు.

వార్నర్ ఔట్ అయినా.. ఫించ్ మాత్రం దూకుడుగానే ఆడుతున్నాడు. సెంచరీకి చేరువగా వచ్చాడు. అతనికి స్టీవ్ స్మిత్ సహకారం అందిస్తున్నాడు. ఆసీస్ 31 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 179 పరుగులు చేసింది. క్రీజులో ఫించ్ (86), స్మిత్ (9) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్ షమీ ఒక వికెట్ తీశాడు.

తొలి వన్డేలో ఆరోన్ ఫించ్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 5.5వ ఓవర్లో సింగిల్ తీసి 17 రన్స్ చేసిన ఫించ్.. వన్డేల్లో 5000 పరుగుల క్లబ్‌లో చేరాడు. ఆస్ట్రేలియా తరఫున వేగంగా ఐదు వేల రన్స్ చేసిన రెండో ఆటగాడు ఫించ్ కావడం గమనార్హం. ఫించ్‌ 126 ఇన్నింగ్స్‌ల్లో 5 వేల రన్స్ మైలురాయిని అందుకున్నాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 115 ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు వేల పరుగులు చేశాడు.

Story first published: Friday, November 27, 2020, 11:53 [IST]
Other articles published on Nov 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+