
4 ఓవర్లలో 20 రన్స్:
29 ఏళ్ల టీ నటరాజన్ ఆస్ట్రేలియా సిరీస్ ద్వారానే భారత్ తరఫున టీ20ల్లోకి ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచులో మూడు వికెట్లు తీసిన నటరాజన్.. రెండో టీ20లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లంతా భారీగా పరుగులు ఇచ్చుకోగా.. నట్టూ పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 20 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ బౌలింగ్ చేసిన నటరాజన్.. ఆ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి డార్సీ షార్ట్ వికెట్ తీశాడు. 9వ ఓవర్లో 6 పరుగులు ఇచ్చిన నట్టూ.. 15వ ఓవర్లో 5 రన్స్ ఇచ్చాడు. ఇక 19వ ఓవర్లో 8 పరుగులిచ్చి హెన్రిక్స్ వికెట్ తీశాడు. నట్టూ కారణంగానే ఆసీస్ 15-20 పరుగులు తక్కువగా చేసింది.

నట్టూ ఒక్కడే మనసులు గెలిచాడు:
'ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ టీమిండియా బౌలింగ్‌పై విరుచుకుపడ్డారు. డీఆర్కీ షార్ట్ త్వరగా ఔటైనా.. మాథ్యూ వేడ్ బౌలర్లందరినీ చితకొట్టాడు. శార్దుల్, దీపక్, వాషింగ్టన్‌తో పాటు చివరికి చహల్‌ను కూడా ఉతికారేశాడు. చహల్ తన 4 ఓవర్లలో ఏకంగా 51 పరుగులిచ్చాడు. అయితే నటరాజన్ ఒక్కడే అందరి మనుసులు గెలుచుకున్నాడు. అతడికిది రెండో టీ20, మూడో అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే. నాలుగు స్పెల్స్‌లో ఒక్కొక్క ఓవర్ ఇచ్చినా చాలా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 2 వికెట్లు తీశాడు' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

చాలా బాగా బంతులేస్తున్నాడు:
'మిగతా బౌలర్లంతా ఈ మ్యాచ్‌లో టీ నటరాజన్ ప్రదర్శనను చూసి చాలా కాలం గుర్తు ఉంచుకుంటారు. ఈ మ్యాచ్‌లో నటరాజనే అతి పెద్ద సానుకూలాంశం. అతడు చాలా బాగా బంతులేస్తున్నాడు' అని ఆకాష్ చోప్రా మెచ్చుకున్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (42; 22 బంతుల్లో 3x4, 2x6) మెరుపు బ్యాటింగ్ చేసి టీమిండియాను గెలిపించిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీసేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టీ20 ఆదివారం జరగనుంది.

అరుదైన రికార్డు:
రెండో టీ20లో టీమిండియా విజయం తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది గతంలో ఏ ఇతర ఇండియన్ కెప్టెన్‌కూ సాధ్యం కాని రికార్డు. ఆసీస్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో సిరీస్‌లు గెలిచిన ఏకైక భారత కెప్టెన్ విరాట్కోహ్లీనే. మొత్తంగా చూసుకుంటే మాత్రం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.
'రసెల్ కన్నా హార్దిక్ అత్యుత్తమం.. టీమిండియా ఫినిషర్ పాండ్యానే'


Click it and Unblock the Notifications












