ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కన్నా.. ఎక్కువే ఆడగలనని హార్దిక్ నిరూపించాడు: ఆకాశ్‌

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కన్నా ఎక్కువే ఆడగలనని హార్దిక్‌ నిరూపించాడన్నాడు. హార్దిక్‌ క్రీజులో ఉన్నంత సేపు భారత శిబిరంలో గెలుపు ఆశలు నిలిపాడని ఆకాశ్‌ పేర్కొన్నాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో తలపడిన తొలి వన్డేలో హార్థిక్ (76 బంతుల్లో 90; 7ఫోర్లు, 4సిక్స్‌లు) తృటిలో శతకం కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో భారత్‌పై అలవోక విజయం సాధించింది.

హార్దిక్ నాణ్యమైన బ్యాట్స్‌మన్‌:

హార్దిక్ నాణ్యమైన బ్యాట్స్‌మన్‌:

తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడిన ఆకాష్ చోప్రా ఈ మ్యాచ్‌పై విశ్లేషణ చేశాడు. 'హార్దిక్‌ పాండ్యా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఒక నాణ్యమైన బ్యాట్స్‌మన్‌ ఆరో స్థానంలో ఆడటం ఎన్నిసార్లు కుదురుతుంది. అతడికి ఆ అవకాశం రావడంతో నిరూపించుకున్నాడు. తన ఆట తీరుతో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కన్నా.. ఎక్కువే ఆడగలనని చాటిచెప్పాడు. ఇతర బ్యాట్స్‌మన్‌ షార్ట్‌పిచ్‌ బంతులతో సతమతమయితే హార్దిక్ మాత్రం వాటిని దీటుగా ఎదుర్కొన్నాడు' అని ఆకాష్ చోప్రా అన్నాడు.

నాలుగైదు స్థానాలకు మారుతాడు:

నాలుగైదు స్థానాలకు మారుతాడు:

'హార్దిక్‌ పాండ్యా స్పిన్నర్లను కూడా ఉతికారేశాడు. తృటిలో సెంచరీ కోల్పోయినా క్రీజులో ఉన్నంతసేపు గెలుపుపై ఆశలు నింపాడు. శిఖర్ ధావన్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. అతడే 75 పరుగులు చేశాడు. పాండ్యా అద్భతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. త్వరలోనే నాలుగు లేదా ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తాడు' అని మాజీ క్రికెటర్‌ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. తొలి వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 374/6 భారీ స్కోర్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఆరోన్‌ ఫించ్ ‌(114), స్టీవ్‌ స్మిత్‌ (105) శతకాలతో మెరవగా భారత బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. పాండ్యా (90), ధావన్ ‌(74) అర్ధ శతకాలు చేశారు.

అరుదైన రికార్డ్:

అరుదైన రికార్డ్:

ఈ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించలేకపోయినా.. హార్దిక్ పాండ్యా వన్డేల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. భారత్‌ తరఫున వన్డేల్లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా హార్దిక్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. పాండ్యా 857 బంతుల్లోనే వెయ్యి పరుగులు చేయడం విశేషం. 2014లో వన్డేలోకి అరంగేట్రం చేసిన జాఫర్ 937 బంతుల్లో వెయ్యి పరుగులు చేయగా.. ఆ రికార్డును హార్దిక్ బద్దలుకొట్టాడు. 55 వన్డేలు ఆడిన హార్దిక్ 39 ఇన్నింగ్స్‌ల్లో 115.81 స్ట్రైక్ రేట్‌తో 1047 రన్స్ చేశాడు. వన్డేల్లో వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ అగ్రస్థానంలో ఉన్నాడు. రస్సెల్ 767 బంతుల్లోనే 1000 రన్స్ చేశాడు.

India vs Australia: విరాట్ కోహ్లీ చెత్త రికార్డ్.. రెండో వన్డేలోనూ ఓడితే!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, November 28, 2020, 18:25 [IST]
Other articles published on Nov 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X