న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా vs ఆస్ట్రేలియా: ఆసీస్ జట్టులో బుల్లి క్రికెటర్, జెర్సీ వేసుకుని ప్రాక్టీస్

India vs Australia: 6-year-old Archie Schiller included to Australian squad, here is why

హైదరాబాద్: ఆస్ట్రేలియా టెస్టు జట్టులో మరో క్రికెటర్‌ను ఎంపిక చేశారు. అయితే, ఎంపికైన క్రికెటర్ వయసు కేవలం ఆరేళ్లు మాత్రమే. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

<strong>ఇండియా vs ఆస్ట్రేలియా: సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆ ఐదు జోడీలివే!</strong>ఇండియా vs ఆస్ట్రేలియా: సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఆ ఐదు జోడీలివే!

దీంతో తొలి టెస్టుకు ముందు ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆస్ట్రేలియా జట్టుతో కలిసి ఆర్చీ షిల్లర్ నెట్ ప్రాక్టీస్ చేశాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో డిసెంబర్ 26న జరిగే బాక్సింగ్ డే టెస్టుకు కూడా అతడు టెస్టు జట్టులోనే కొనసాగనున్నాడు.

కోహ్లీని ఔట్ చేయాలని ఉందన్న ఆర్చీ షిల్లర్

కోహ్లీని ఔట్ చేయాలని ఉందన్న ఆర్చీ షిల్లర్

షేన్‌వార్న్‌ను ఆదర్శంగా తీసుకొని కెరీర్‌ను ప్రారంభించిన లెగ్‌స్పిన్నర్ ఆర్చీ షిల్లర్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేయాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పాడు. దుబాయి వేదికగా పాకిస్థాన్‌తో ఆస్ట్రేలియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడుతున్న క్రమంలో ఆర్చీ షిల్లర్‌కి హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ నుంచి నేరుగా కాల్ చేశాడు.

వీడియో కాల్ ద్వారా జట్టులోకి

వీడియో కాల్ ద్వారా తనను ఆస్ట్రేలియా టెస్టు జట్టులోకి ఎంపిక చేసినట్లు ఆర్చీ షిల్లర్ పేర్కొన్నాడు. ఆసీస్ జట్టుతో కలవగానే ఆస్ట్రేలియా జెర్సీని అతనికి అందజేశారు. అంతేకాదు ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లతో కలిసి ఆర్చీ షిల్లర్ ప్రాక్టీస్ చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్‌లో పంచుకుంది.

క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్‌లో ట్వీట్

ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు ఎంపికైన ఆర్చీ షిల్లర్ అడిలైడ్ ఓవల్ మైదానంలో ఆటగాళ్లతో కలిసి ఫొటోకు పోజులిచ్చాడు. ఈ సందర్భంగా ఓ యువ ఆటగాడు జట్టులోకి వచ్చినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ తన ట్విటర్‌లో పేర్కొంది.

 గత పర్యటనలో నాలుగు సెంచరీలు చేసిన కోహ్లీ

గత పర్యటనలో నాలుగు సెంచరీలు చేసిన కోహ్లీ

2014-15లో ఆసీస్ గడ్డపై చివరిసారిగా భారత్ జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడింది. ఆ పర్యటనలో విరాట్ కోహ్లీ మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 692 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ సిరిస్‌లో స్టీవ్ స్మిత్(769) తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

అందరి కళ్లూ కోహ్లీపైనే

అందరి కళ్లూ కోహ్లీపైనే

మళ్లీ మూడేళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు వచ్చింది. అయితే, ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన రికార్డ్స్‌కి చేరువలో కోహ్లీ ఉన్నాడు. గురువారం నుంచి అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. అందరి కళ్లూ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి.

Story first published: Tuesday, December 4, 2018, 17:41 [IST]
Other articles published on Dec 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X