
2017 తర్వాత ఆసీస్ నెగ్గిన తొలి వన్డే సిరిస్
జనవరి 2017లో పాకిస్థాన్‌ను 4-1తేడాతో ఓడించిన తర్వాత ఆస్ట్రేలియా గెలిచిన మొదటి వన్డే సిరిస్ ఇది.
కోహ్లీ కెప్టెన్సీలో స్వదేశంలో భారత్ వన్డే సిరీస్ ఓడడం ఇదే తొలిసారి. అలాగే అతడి నాయకత్వంలో వరుసగా మూడు వన్డేలనూ ఓడడం ఇదే మొదటిసారి.
1996 వరల్డ్‌కప్‌లో చివరిసారిగా కోట్లా మైదానంలో శ్రీలంక జట్టు 250+ లక్ష్యాన్ని ఛేదించింది.

సొంతగడ్డపై భారత్‌కు మరోసారి పరాభవం
2015లో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓడిన తర్వాత సొంతగడ్డపై భారత్‌కు మరోసారి వన్డే సిరిస్ పరాభవం ఎదురైంది.
స్వదేశంలో టీమిండియా చివరగా వరుసగా మూడు వన్డేలు ఓడి పదేళ్లయ్యింది. 2009లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయంపాలైంది. కంగారూల జట్టు భారత్‌లో చివరగా వన్డే సిరీస్‌ను అప్పుడే గెలిచింది.
0-2తో వెనకబడి ఓ జట్టు సిరీస్ సాధించడం ఇది ఐదోసారి మాత్రమే. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా వరుసగా ఆరు సిరీస్‌లు ఓడింది.

వన్డేల్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్న రోహిత్
రోహిత్ శర్మ వన్డేల్లో 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ (183 మ్యాచ్‌ల్లో), డివిలియర్స్ (190) తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ (206) నిలిచాడు.
2-0తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ రెండుసార్లు సిరీస్ కోల్పోయిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది.
భారత్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డివిలియర్స్ (353) రికార్డును ఖవాజా (383) అధిగమించాడు.

ప్యాట్ కమిన్స్ రికార్డు
ఈ సిరిస్‌లో ప్యాట్ కమిన్స్ 14 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ ద్వైపాక్షిక సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు మిచెల్ జాన్సన్ (2007), క్లింట్ మెక్‌కే(2010) సరసన నిలిచాడు.
ఈ సిరిస్‌లో ఉస్మాన్ ఖవాజా నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. తద్వారా ఓ ద్వైపాక్షిక సిరిస్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
ఈ సిరిస్‌లో ఖవాజా 383 పరుగులు సాధించాడు. ఓ ద్వైపాక్షిక సిరిస్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆసీస్ ఆటగాడిగా ఖవాజా గుర్తింపు పొందాడు. అంతకముందు డేవిడ్ వార్నర్(386), జార్జి బెయిలీ(478) పరుగులతో ఉన్నారు.


Click it and Unblock the Notifications













