నాగపూర్: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో (చివరి) వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఆసిస్ పైన గెలుపొందింది. దీంతో సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియో 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 243 పరుగులు చేసింది. కేవలం 42.5 ఓవర్లలోనే టార్గెట్ చేధించింది.

రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. అతనికి వన్డేల్లో ఇది 14వ సెంచరీ. రోహిత్ శర్మను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ హార్దిక్ పాండేను వరించింది. భారత్‌కు ఇది వరుసగా ఆరో సిరీస్ విజయం. ఈ గెలుపుతో భారత్ వన్డేల్లో తిరిగి నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది.