ఢిల్లీలో 5th ODI: రెండు మార్పులతో బరిలోకి భారత్, ఆసీస్ బ్యాటింగ్

హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ పర్యటన ముగింపు దశకు చేరుకుంది. భారత్‌లో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఈ సిరిస్‌లో చివరి మ్యాచ్ ఆడుతుంది. భారత్‌తో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం ప్రారంభమైన ఆఖరి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు మార్పులు చేశాడు. మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌పై వేటు వేసి అతడి స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని జట్టులోకి తీసుకున్నాడు. అలాగే మూడో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ని తప్పించి.. అదనపు బౌలర్ రూపంలో మహ్మద్ షమీకి అవకాశం ఇచ్చాడు.
సిరిస్ విజేతను తేల్చే వన్డే
మరోవైపు సిరీస్ విజేతను తేల్చే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. షాన్ మార్ష్ స్థానంలో మార్కస్ స్టోయినిస్, బౌలర్ బెహ్రండార్ఫ్ స్థానంలో స్పిన్నర్ నాథన్ లయాన్‌కు కెప్టెన్ ఆరోన్ ఫించ్ తుది జట్టులో చోటు కల్పించాడు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో భారత్ గెలుపొందగా.. తర్వాత రెండు వన్డేల్లో కంగారూలు విజయం సాధించడంతో సిరీస్ 2-2తో సమం అయింది.
ఆఖరి వన్డేపై సర్వత్రా ఆసక్తి
దీంతో విజేత నిర్ణయాత్మక ఈ ఆఖరి వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు గట్టి పట్టుదలగా ఉన్నాయి. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి సొంతగడ్డపై ఎదురైన పరాభవానికి ఎలాగైనా బదులు తీర్చుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తుండగా.. వరల్డ్‌కప్‌కు ముందు సిరీస్ నెగ్గి ఆత్మవిశ్వాసంతో మెగా టోర్నీలో పాల్గొనాలని కోహ్లీసేన భావిస్తోంది.
2009లో ద్వైపాక్షిక సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియా
2009లో ఆస్ట్రేలియా ఇక్కడ ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. 2016 అక్టోబర్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా 2014లో మాత్రం విండీస్‌పై 48 పరుగుల తేడాతో గెలిచింది.2020లో వన్డే లీగ్ మొదలుకానున్న నేపథ్యంలో భారత్-ఆసీస్ జట్ల మధ్య ఇదే చివరి ఐదు మ్యాచ్‌ల సిరీస్. ఇక నుంచి జరగబోయే ప్రతి సిరీస్‌లో మూడు మ్యాచ్‌లే ఉంటాయి.

జట్ల వివరాలు:
టీమిండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మమద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా:
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజ, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, ఆస్టన్ టర్నర్, క్యారీ, ప్యాట్ కమిన్స్, నాథన్ లయాన్, జేడ్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications