5th ODIలో టీమిండియా ఓటమి: 3-2తో సిరిస్ ఆస్ట్రేలియా కైవసం


హైదరాబాద్: వరల్డ్‌కప్ ముందు ఆడిన చివరి వన్డే సిరిస్‌ను టీమిండియా చేజార్చుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆసీస్‌తో బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను ఆస్ట్రేలియా 3-2తేడాతో కైవసం చేసుకుంది. చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతినివ్వడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది.

రెండు విజయాలతో ఆరంభించిన టీమిండియా
ఐదు వన్డేల సిరీస్‌ను వరుసగా రెండు విజయాలతో ఆరంభించిన టీమిండియా.. ఆ తర్వాత ప్రయోగాల వెంట పరుగెత్తి చివరి మూడు వన్డేల్లోనూ ఓడిపోయింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు సరైన ఆరంభం లభించలేదు. ఆరంభంలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ (12), కెప్టెన్ విరాట్ కోహ్లి (20) పేలవంగా వికెట్లు చేజార్చుకున్నారు.

జట్టు స్కోరు 132 వద్ద రోహిత్ శర్మ పెవిలియన్‌కు
ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (16), విజయ్ శంకర్ (16) కూడా నిరాశపరిచారు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (56: 89 బంతుల్లో 4 పోర్లు) హాఫ్ సెంచరీతో ఒంటరిగా పోరాడాడు. జట్టు స్కోరు 132 వద్ద రోహిత్ శర్మ పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (0) డకౌటయ్యాడు. 28.5 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 132/6తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.

కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన టీమిండియా
చివర్లో కేదార్ జాదవ్(44), భువనేశ్వర్ కుమార్(46)లు ఓ సమయంలో భారత్ గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. అయితే, వీరిద్దరూ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. దీంతో నిర్ణీత ఓవర్లలో 237 పరుగులకు భారత్ ఆలౌటైంది. దీంతో 35 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్ సిరీస్‌ను 3-2తో చేజిక్కించుకుంది.

మూడు వికెట్లు తీసిన ఆడమ్ జంపా
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా, కమిన్స్, రిచర్డ్స్, స్టోయిన్స్ రెండు, నాథన్ లియాన్ ఒక వికెట్ తీసుకున్నారు. అంతకముందు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (100: 106 బంతుల్లో 10 పోర్లు, 2 సిక్సులు) సెంచరీ, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (52: 60 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications