న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విమర్శలు చేయడంతోనే ఆటలో మార్పొచ్చింది: గవాస్కర్

 India vs Australia, 4th Test: Savage Sunny G!, when Sunil Gavaskar took a dig at Ravi Shastri on air

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయానికి టీమిండియా అత్యంత చేరువలో ఉంది. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్, తొలి కోచ్‌గా నిలవడానికి విరాట్ కోహ్లి , రవిశాస్త్రిలు తహతహలాడుతున్నారు. అయితే ఈ సమయంలో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కోచ్ రవిశాస్త్రికి ఓ సూపర్ పంచ్ వేశాడు. తొలి టెస్టు గెలిచిన తర్వాత రవిశాస్త్రి చేసిన కామెంట్స్‌కు సునీల్ గవాస్కర్ కౌంటర్ వేశాడు. సోషల్ మీడియా వేదికగా రవిశాస్త్రిపైన సహజంగానే నెటిజన్లు సాకు కోసం చూస్తూ ఉంటారు. అలాంటిది గవాస్కర్ చేసిన వ్యాఖ్యలకు మద్ధతుగా నిలిచి రవిశాస్త్రిని ఏకీపారేశారు. ఆసీస్ గడ్డపై తొలి టెస్ట్‌లో గెలిచేసరికి శాస్త్రి కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది.

వేల కిలోమీటర్ల దూరం విమర్శల నుంచే

వేల కిలోమీటర్ల దూరం విమర్శల నుంచే

ఈ సందర్భంగా మాట్లాడిన కోచ్.. వేల కిలోమీటర్ల దూరంలో ఉండి విమర్శలు చేయడం చాలా ఈజీ అని తేల్చపడేశాడు. ఇదే విషయాన్ని గవాస్కర్ ప్రస్తావించాడు. ఆదివారం సిడ్నీ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత మురళీ కార్తీక్‌తో కలిసి మ్యాచ్‌పై విశ్లేషణ చేసిన సందర్భంగా సన్నీ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. పెర్త్ టెస్ట్‌లో ఓటమి టీమిండియాకు ఓ మేలుకొలుపులా పనిచేసిందని మురళీ కార్తీక్ అన్నాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న గవాస్కర్ మాట్లాడుతూ.. మరి ఆ మేలుకొలుపు ఎలా వచ్చింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ల విమర్శల నుంచే వచ్చింది. ఆ విమర్శల సడితోనే ఈ జట్టు మేల్కొందని గవాస్కర్ అన్నాడు.

30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

టీమిండియాతో టెస్టు సిరీస్‌లో తలపడుతోన్న ఆస్ట్రేలియా ఓటమి దిశగా పయనిస్తున్న క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌ను తప్పించుకోలేకపోయింది. ఇలా సొంతగడ్డపై ఆసీస్‌ ఫాలోఆన్‌ ఆడటం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1988లో సొంత గడ్డపై చివరిసారి ఇదే సిడ్నీ మైదానంలో ఇంగ్లాండ్‌తో ఫాలో ఆన్‌ ఆడిన ఆసీస్‌.. మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇక విదేశాల్లో 2005లో చివరగా ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాలో ఆన్‌ ఆడిన ఆసీస్‌ పరాజయం పాలైంది. దాంతో పాటుగా భారత్‌కు ఆసియా వెలుపల అత్యల్ప టార్గెట్‌తో ఫాలో ఆన్ ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి.

 ఆసియా వెలుపల బెస్ట్ ఇన్నింగ్స్

ఆసియా వెలుపల బెస్ట్ ఇన్నింగ్స్

గ్రాస్ లెట్ వేదికగా 2006వ సంవత్సరంలో వెస్టిండీస్ 373 పరుగుల వద్ద, లీడ్స్ వేదికగా 2002వ సంవత్సరంలో ఇంగ్లాండ్‌కు 355 పరుగుల వద్ద, నార్త్ సౌండ్ వేదికగా 2003వ సంవత్సరంలో 323 పరుగుల వద్ద, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా 2018/19లో ఆస్ట్రేలియాకు 322 పరుగుల వద్ద, ఓవల్ స్టేడియం వేదికగా 2007వ సంవత్సరంలో 319 పరుగుల వద్ద, కింగ్‌స్టన్ స్టేడియం వేదికగా 2016వ సంవత్సరంలో 304 పరుగుల వద్ద వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.

Story first published: Sunday, January 6, 2019, 16:26 [IST]
Other articles published on Jan 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X