
11 టెస్టులు ఆడగా
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టుతో పాటు మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించగా... పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. దీంతో సిడ్నీ వేదికగా జరిగే నాలుగో టెస్టులో టీమిండియా నెగ్గినా లేదా డ్రాగా ముగించినా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోనే అవకాశం ఉంది. బాక్సింగ్ డే టెస్టు విజయం జోరుతో సిడ్నీ టెస్టుకు టీమిండియా సిద్ధమైంది. ఇక, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా రికార్డు ఫరవాలేదు. 1947 సిరీస్ నుంచి 2015 సిరీస్ సిడ్నీ వేదికగా 11 టెస్టులు ఆడగా అందులో భారత క్రికెట్ జట్టు 5 ఓటమి పాలు కాగా, 5 టెస్టులను డ్రాగా ముగించింది. కేవలం ఒకే ఒక్క టెస్టులో మాత్రమే విజయం సాధించింది.

చివరి టెస్టు ద్వారా తీర్చుకోవాలన్న
దీంతో సిడ్నీ టెస్ట్ విజయంతో పాటు సిరీస్ విజయం లేని లోటును చివరి టెస్టు ద్వారా తీర్చుకోవాలన్న టీమిండియా తహతహలాడుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో కోహ్లీసేన అంచనాలకు మించి ప్రదర్శన చేస్తోంది. సిరీస్ సొంతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా అడిలైడ్ టెస్టు నుంచీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. సిడ్నీ టెస్టులో సైతం పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగి ఆస్ట్రేలియాను చిత్తు చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ భార్య రితికా ఆదివారం పండంటి పాపకు జన్మనివ్వడంతో నాలుగో టెస్టుకు దూరమయ్యాడు.

13 మంది సభ్యుల జాబితాలో
గాయం కారణంగా పెర్త్, మెల్‌బోర్న్ టెస్ట్‌లకు దూరమైన అశ్విన్ పేరుని 13 మంది సభ్యుల జాబితాలో సెలక్టర్లు చేర్చారు. అయితే, అతడు సిడ్నీ టెస్టులో ఆడతాడా లేదా అన్నది గురువారం ఉదయం వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. అశ్విన్ ఆడకపోతే జడేజా, కుల్దీప్ యాదవ్‌లలో ఒకరికి జట్టులో చోటు దక్కుతుంది. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కకపోతే జడేజా, కుల్దీప్‌లు కీలకం కానున్నారు. కారణం సిడ్నీ టెస్టు పిచ్ స్పిన్నర్లకు అనుకూలమనే వార్తలు వస్తున్నాయి.

సిడ్నీ టెస్టులో టాస్ కూడా కీలకం
గాయం నుంచి కోలుకుని చివరి రెండు టెస్ట్‌లకు ఎంపికైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు లేకపోవడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా ఉంది. టిమ్ పైన్ సారధ్యంలోని ఆసీస్ జట్టులో కమ్మిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్ వంటి పేసర్లు ఉన్నా... బలమైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడం ఆ జట్టుని వేధిస్తోంది. సిడ్నీ టెస్టులో ఆతిథ్య జట్టులో సైతం పలు మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓపెనర్ ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్‌పై వేటు పడే అవకాశం ఉంది. సిడ్నీ టెస్టు విజయంలో టాస్ కూడా కీలకం కానుంది.

జట్ల వివరాలు:
భారత్: కోహ్లీ(కెప్టెన్), రహానె(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, రిషబ్‌పంత్, జడేజా, కుల్‌దీప్ యాదవ్, అశ్విన్, షమీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్.
ఆస్ట్రేలియా: టిమ్ పైన్, మార్కస్ హారిస్, ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్, నాథన్ లయాన్, మిచెల్ స్టార్క్, కమ్మిన్స్, హెజెల్‌ఉడ్, లాబుస్‌ఛాఘ్నే, పీటర్ హ్యాండ్స్ కోంబ్, పీటర్ సిడ్డిల్
మ్యాచ్ ప్రారంభం: గురువారం ఉదయం 5 గంటలకు


Click it and Unblock the Notifications












