తొలిరోజు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన కోహ్లీ కవర్ డ్రైవ్ (వీడియో)


హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాదిన ఓ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతోన్న విరాట్ కోహ్లీ సిడ్నీ టెస్టులో కళ్లు చెదిరే కవర్‌డ్రైవ్‌తో అలరించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. పుజారా (130) సెంచరీతో చెలరేగగా, మయాంక్ అగర్వాల్ (77) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది.

ఎక్స్‌ట్రా కవర్స్ వైపు కోహ్లీ షాట్
నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ నాలుగో బంతిని ఎక్స్‌ట్రా కవర్స్ వైపు కోహ్లీ షాట్ ఆడాడు. 135 కిలో మీటర్ల వేగంతో జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతిని సింపుల్‌గా కవర్ డ్రైవ్ షాట్‌తో బౌండరీ లైన్ దాటించాడు.
ఈ షాట్‌తో తన ప్రత్యేకతను
అద్భుతమైన టైమింగ్‌తో కొహ్లీ కొట్టిన ఈ షాట్ తొలి రోజు ఆటకే హైలైట్‌గా నిలిచింది. కోహ్లీ షాట్‌కు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. తొలి రోజు ఆటకే షాట్ ఆఫ్ ద డే అంటూ కామెంట్ పెట్టింది. ఈ షాట్‌తో తన ప్రత్యేకత ఏంటో మరోసారి తెలిసేలా చేశాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్
ఈ షాట్ చూసిన తర్వాత కోహ్లీని ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎందుకు అంటారో అర్ధం చేసుకోవచ్చు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో ఛటేశ్వర్ పుజారా(130), హనుమ విహారి(39) పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజెల్‌ఉడ్ రెండు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్‌లకు చెరో వికెట్ లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications