300 పరుగులతో ఇన్నింగ్స్ ముగించిన ఆస్ట్రేలియా

సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు దూకుడు కనబరిచారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నిర్దేశించిన 622 ఛేదించే క్రమంలో పైన్ సేన విఫలమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ఆరంభంలో వర్షం కారణంగా కాసేపు నిలిచిపోయింది. ఆటలో నాలుగోరోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 236/6తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించేందుకు ఆస్ట్రేలియా ప్రయత్నించగా.. వరుణుడు అడ్డుపడ్డాడు. కనీసం బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వెళ్లకముందే వర్షం మొదలవడంతో ఆదివారం ఒక బంతి కూడా పడలేదు.

దాదాపు గంటసేపు సమయం వృథా
కాసేపటికి బ్యాటింగ్‌కు దిగిన వెంట వెంటనే 2 వికెట్లు చేజార్చుకుంది. 90వ ఓవర్లో బుమ్రా వేసిన బంతికి హాండ్స్‌కాంబ్(37) బౌల్డ్ అయ్యాడు. 91 ఓవర్లో కుల్‌దీప్ వేసిన బంతికి నాథన్ లయన్ పరుగులేమీ చేయకుండానే ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 91 ఓవర్లలో తొమ్మిది వికెట్లు చేజార్చుకుని 258 పరుగులు చేసింది. శుక్రవారం చతేశ్వర్ పుజారా (193: 373 బంతుల్లో 22ఫోర్లు), రిషబ్ పంత్ (159 నాటౌట్: 189 బంతుల్లో 15ఫోర్లు, 1సిక్సు) సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌ని భారత్ 622/7తో డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. శనివారం కూడా దాదాపు గంటసేపు ఆట సమయం వృథా అయ్యింది.

తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో
ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. నాలుగు టెస్టుల సిరీస్‌ని భారత్ 2-1తో కైవసం చేసుకోనుంది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించగా.. ఆ తర్వాత పెర్త్ టెస్టులో 146 పరుగులతో ఆస్ట్రేలియా, మెల్‌బౌర్న్ టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
మైదానమంతా పింక్‌మయం
సిడ్నీ టెస్టు మూడో రోజు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ సంతకాలతో కూడిన గులాబీ రంగు టోపీలను దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌కు తిరిగొచ్చారు. రొమ్ము క్యాన్సర్‌తో మృతి చెందిన మెక్‌గ్రాత్ భార్య జేన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు నిధుల సమీకరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా జనవరిలో నిర్వహించే తొలి టెస్టులో ఆటగాళ్లు ‘పింక్' కలర్‌లోని క్రీడా సామాగ్రితో మైదానంలో దిగుతారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ కోహ్లి సైతం గులాబీ రంగు గ్రిప్‌తో బ్యాటింగ్‌కు దిగాడు. దీనిపై ‘మైదానంలోనే కాదు... బయట కూడా భారత క్రికెట్ జట్టు అభిమానం పొందింది. అద్భుతమైన సహకారం' అంటూ మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ట్వీట్ చేసింది
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications