ఆసీస్ గడ్డపై అనుకోని రికార్డు: ఆసీస్‌పై ఈ ఘనత సాధించిన ఏకైక జట్టు టీమిండియానే


హైదరాబాద్: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 622/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాపై వరుసగా మూడు ఇన్నింగ్స్‌లను డిక్లేర్ చేసిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై ఇలా చేయడం భారత్‌కు ఇది రెండోసారి.
గతంలో 2008లో భారత్‌లో జరిగిన మొహాలీ, ఢిల్లీ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై వరుసగా మూడు ఇన్నింగ్స్‌లను డిక్లేర్ చేశారు. ఆ సిరీస్‌లో టీమిండియా విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా మరోసారి ఈ ఘనత సాధించింది. దీంతో పాటు ఒకే గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాపై 600కుపైగా పరుగులను మూడు సార్లు చేసిన జట్టుగా భారత్ నిలిచింది.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ అరుదైన రికార్డు
ఈ రికార్డుని టీమిండియా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోనే సాధించడం విశేషం. గురువారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా 622/7 వద్ద డిక్లేర్ చేయడంతో ఈ గ్రౌండ్‌లో అత్యధికంగా మూడు సార్లు 600కుపైగా పరుగులు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. ఈ గ్రౌండ్‌లో టీమిండియా అత్యధిక స్కోరు 705/7 డిక్లేర్డ్.
సిడ్నీలో భారత్ అత్యధిక స్కోరు 705/7 డిక్లేర్డ్
ఈ స్కోరుని 2003-04 పర్యటనలో చేసింది. అంతకముందు 1985-86 పర్యటనలో టీమిండియా చేసిన 600/4 డిక్లేర్డ్ మూడో స్థానంలో నిలిచింది. స్ట్రేలియా గడ్డపై టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఆసీస్‌తో జరుగుతోన్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ముందంజలో ఉన్న భారత్.. ఆఖరి సిడ్నీ టెస్టులోనూ అద్భుతంగా ఆడుతోంది.
సిడ్నీలో సెంచరీలతో చెలరేగిన పంత్, పుజారా
తొలి ఇన్నింగ్స్‌లో ఛటేశ్వర్ పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సెంచరీలు, రవీంద్ర జడేజా (81), మయాంక్ అగర్వాల్ (77) హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. టాప్ ఆర్డర్ నుంచి మిడిలార్డర్ వరకు భారత్ బ్యాట్స్‌మన్ అంతా సమిష్టిగా రాణించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications