మొహాలీలో 4th ODI: రోహిత్-ధావన్ దెబ్బకు సచిన్-సెహ్వాగ్ రికార్డు బద్దలు

హైదరాబాద్: మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్-రోహిత్ శర్మల జోడి అరుదైన ఘనతను సాధించింది. వన్డేల్లో భారత్ తరుపున అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జాబితాలో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌ల జోడి రెండో స్థానానికి ఎగబాకింది.
ఈ క్రమంలోనే ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్(4,387 పరుగులు) జోడిని వెనక్కినెట్టింది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడీ 8, 227 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. అయితే, ఈ జోడీ భారత్ తరుపున మాత్రమే కాదు, మొత్తంగా కూడా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
నాలుగు వన్డేలో
తాజాగా ఆదివారం మొహాలీ వేదికగా జరుగుతున్న నాలుగు వన్డేలో ప్యాట్ కమిన్స్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి ధావన్ ఫోర్ కొట్టడంతో ద్వారా భారత్ తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండో జోడీగా అరుదైన ఘనత సాధించారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించిన రోహిత్-ధావన్‌ల జోడి.. సచిన్-సెహ్వాగ్‌ల సెంచరీల భాగస్వామ్యం రికార్డును అధిగమించింది. ఆ మ్యాచ్‌లో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా 15వ సారి ఆ ఘనతను సాధించిన జోడీగా రోహిత్‌శర్మ-శిఖర్ ధావన్‌ల జోడి నిలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
ఇదిలా ఉంటే, నాలుగో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అందరూ ఊహించినట్లుగానే నాలుగో వన్డే తుదిజట్టులో జట్టు మేనేజ్‌మెంట్ నాలుగు మార్పులు చేసింది. మహేంద్రసింగ్ ధోనీ, అంబటి రాయుడు, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా స్థానంలో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్‌లకు చోటు కల్పించింది.
నిలకడగా ఆడుతోన్న ఓపెనర్లు
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. తనకు బాగా అచ్చొచ్చిన మైదానంలో ఓపెనర్ శిఖర్ ధావన్ బౌండరీలతో చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో 51 బంతుల్లో 9ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో ధావన్‌కిది 28వ హాఫ్ సెంచరీ. మరోఎండ్‌లో రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతున్నాడు. వీరిద్దరూ మంచి రన్‌రేట్‌తో భారత్‌కు చక్కటి శుభారంభం అందించారు.
18 ఓవర్లు
ప్రస్తుతం 18 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ధావన్(60), రోహిత్(41) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు ముగియగా భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాంచీ వేదికగా గత శుక్రవారం ముగిసిన మూడో వన్డేలో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications