మొహాలీలో 4th ODI: నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా

హైదారాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో వన్డే ప్రారంభమైంది. మొహాలి వేదికగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు ముగియగా భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
రాంచీ వేదికగా గత శుక్రవారం ముగిసిన మూడో వన్డేలో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
2-1తో ఆధిక్యంలో టీమిండియా
ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు ముగియగా భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాంచీ వేదికగా గత శుక్రవారం ముగిసిన మూడో వన్డేలో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు రాంచీ వన్డేలో కోహ్లీ సెంచరీ బాదినా.. విజయాన్ని అందుకోలేకపోయింది.
3-1తో సిరీస్ చేజిక్కించుకోవాలని
దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి భారత క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ చేజిక్కించుకోవాలని ఆశిస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. మంగళవారం నాగ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన మూడో వన్డేలో మాత్రం కోహ్లీ సెంచరీ సాధించినా.. 32 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది.

భారత్ జట్టు:
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా

ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, హాండ్స్‌కాంబ్, మాక్స్‌వెల్, టర్నర్, అలెక్స్ కేరీ, రిచర్డ్‌సన్, కమిన్స్, బెహ్న్రెడార్ఫ్, ఆడమ్ జంపా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications