
మెల్‌బౌర్న్ వేదికగా తొలిసారి బాక్సింగ్ డే టెస్టు
399 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 258/8తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా 261 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో.. 37ఏళ్ల తర్వాత మెల్‌బౌర్న్‌లో భారత్ జట్టు ఎట్టకేలకి టెస్టు విజయాన్ని అందుకుంది. చివరిసారిగా 1981లో భారత్ ఆ మైదానంలో గెలుపొందింది. మెల్‌బౌర్న్ వేదికగా జరిగిన 8 బాక్సింగ్ డే టెస్ట్‌లలో భారత్ 5 సార్లు ఓడిపోగా, రెండు సార్లు డ్రా చేసుకుంది. ఈ విజయంతో తొలిసారి బాక్సింగ్ డే టెస్టు గెలిచిన రికార్డు సాధించింది.

అత్యధిక టెస్టు విజయాలందుకున్న కెప్టెన్‌గా
మెల్‌బౌర్న్ విజయంతో.. విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ గంగూలీ రికార్డుని సమం చేశాడు. గంగూలీ 28 టెస్టుల్లో 11 విజయాల్ని అందుకోగా.. కోహ్లీ కేవలం 24 మ్యాచ్‌ల్లోనే ఆ మార్క్‌ని అందుకున్నాడు. ఈ మొత్తంలో విరాట్ కోహ్లీ 21 మ్యాచ్‌ల్లో టాస్ గెలవగా.. ఏకంగా 18 మ్యాచ్‌ల్లో విజయాల్ని చేజిక్కించుకోవడం విశేషం.

పూజారా సెంచరీ.. టీమిండియా విక్టరీ
2018లో విదేశీ గడ్డపై భారత్ జట్టు నాలుగు టెస్టుల్లో గెలుపొందగా.. అన్ని టెస్టుల్లోనూ చతేశ్వర్ పుజారా కనీసం 50పైచిలుకు స్కోరు చేయడం కొసమెరుపు. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై గెలిచిన రెండు టెస్టుల్లోనూ అతను సెంచరీ సాధించాడు. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో 123, 71 పరుగులు చేసిన పుజారా.. మెల్‌బౌర్న్‌లో 106, 0 పరుగులు చేశాడు.

ఒక్క ఏడాదిలో బుమ్రా 48 వికెట్లు
టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా జస్ప్రిత్ బుమ్రా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది జనవరిలో ఐదు రోజుల ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. 48 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా.. ఆస్ట్రేలియా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్‌గానూ నిలిచాడు. 1985లో కపిల్‌దేవ్ 8/109తో మెరవగా.. బుమ్రా 9/86తో ఆ రికార్డుని బ్రేక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ , రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్స్ తీసి ఆస్ట్రేలియా వెన్నువిరిచిన బుమ్రాకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందించారు.

అత్యధిక అవుట్‌లలో భాగమైన వికెట్ కీపర్‌గా
వికెట్ కీపర్‌గానూ రిషబ్ పంత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అత్యధిక అవుట్‌లలో పాలు పంచుకున్న వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డుని సమం చేశాడు. 2008లో బ్రాడ్ హడిన్ 42 ఔట్లతో అగ్రస్థానంలో నిలవగా.. తాజాగా ఆ రికార్డుని రిషబ్ పంత్ సమం చేశాడు. ఈ సిరీస్‌లో మాత్రం ఇప్పటివరకు రిషబ్ 20 ఔట్లలో భాగం పంచుకున్నాడు. దీంతో 1954/55లో పాక్‌పై నరేన్ తమ్హనే (19), 1979/80లో పాక్‌పై సయ్యద్ కిర్మాణీ (19) రికార్డును సమం చేశాడు. ఈ క్రమంలో విండీస్ (2006), ఇంగ్లండ్ (2014)పై నెలకొల్పిన ధోనీ (17) రికార్డును దాటేశాడు.


Click it and Unblock the Notifications
