భారత్‌కు 150వ విజయం: బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ హైలెట్స్

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 137 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా జట్టుకు ఓటమి లేదు. అయితే, ఈసారి మాత్రం కోహ్లీసేన వారికి ఓటమి రుచి చూపించింది.
ఆఖరి రోజు కేవలం రెండు వికెట్ల దూరంలో నిలిచిన భారత విజయంపై వరుణుడు కాస్త ఉత్కంఠ రేపాడు. అయితే, రెండు వికెట్లను భారత్ 4.3 ఓవర్లలోనే నేలకూల్చేందుకు కేవలం 27 బంతులను మాత్రమే తీసుకుంది. ఆసీస్ తమ ఓవర్‌నైట్ స్కోరుకు మూడు పరుగులు మాత్రమే జత చేసింది. ఫలితంగా తమ రెం డో ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది.
ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. బాక్సింగ్ డే టెస్టులో 9 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ హైలెట్స్:

కోహ్లీ టాస్ గెలిచిన సందర్భంలో
* టెస్టుల్లో విరాట్ కోహ్లీ టాస్ గెలిచిన సందర్భంలో ఇప్పటి వరకు భారత్ ఓడిపోలేదు. 21 టెస్టుల్లో 18 గెలవగా, మూడు డ్రాగా ముగిశాయి. అలాగే విదేశాల్లో 9 సార్లు టాస్ నెగ్గితే 8 సార్లు టీమిండియా విజయం సాధించగా, ఒక టెస్టుని డ్రా చేసుకుంది.
* ఆస్ట్రేలియాలో ఒకటికంటే ఎక్కువ టెస్టుల్లో గెలవడం టీమిండియాకు ఇది రెండోసారి. 1977-78 పర్యటనలో రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే సిరీస్‌ను 2-3తో కోల్పోయింది.
* టెస్టు క్రికెట్లో భారత్‌కు ఇది 150వ విజయం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా తర్వాత ఈ ఘనత సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది.

రెండు టెస్టులు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి
* 1986 తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో.. ఏ ఒక్క దేశంలోనైనా ఒకే సిరీస్‌లో రెండు టెస్టులు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి.
* ఈ ఏడాది విదేశాల్లో భారత్ గెలిచిన నాలుగు టెస్టుల్లోనూ 50కి పైగా పరుగులు చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా అరుదైన ఘనత సాధించాడు.
* ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టులో ఉత్తమ గణాంకాలు నమోదు చేసిన పేసర్‌గా కపిల్ (8/109)ను మెల్ బోర్న్ టెస్టులో బుమ్రా (9/86) అధిగమించాడు.

ఈ ఏడాది కోహ్లీ సాధించిన పరుగులు 2653
* ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సాధించిన పరుగులు 2653. ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం అతడికి ఇది వరుసగా మూడోసారి. విరాట్ కోహ్లీ 2016లో 2595, 2017లో 2818 పరుగులు చేశాడు.
* ఆస్ట్రేలియాలో భారత జట్టు గెలిచిన టెస్టులు 7 కాగా, అత్యధికంగా మూడుసార్లు మెల్‌బోర్న్‌లో గెలిచింది.
* అరంగేట్ర ఏడాదిలో అత్యధిక క్యాచ్/స్టంపింగ్ (42) చేసిన వికెట్ కీపర్‌గా బ్రాడ్ హాడిన్‌తో సమంగా రిషభ్ పంత్ నిలిచాడు.
* అరంగేట్ర ఏడాదిలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో బౌలర్ బుమ్రా (48). టెర్రీ ఆల్డర్‌మన్ (1981లో 54), ఆంబ్రోస్ (1988లో 49) బుమ్రా కంటే ముందు ఉన్నారు.

అత్యధిక వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్‌గా ఇషాంత్
* టీమిండియా తరుపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్ ఇషాంత్ (267) నిలిచాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు కుంబ్లే (619), కపిల్ (434), హర్భజన్ (417), అశ్విన్ (342), జహీర్ (311) ఉన్నారు.
* విదేశాల్లో కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన విజయాలు 11. అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్లలో సౌరభ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. గంగూలీ ఈ ఘనతను 28 మ్యాచ్‌ల్లో అందుకోగా.. కోహ్లీ 24 మ్యాచ్‌ల్లోనే సాధించాడు.
* ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా పేసర్లు తీసిన వికెట్ల సంఖ్య 47. ఆస్ట్రేలియాలో మన పేసర్లకు ఇది రెండో అత్యుత్తమం కావడం విశేషం. 1991-92లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పేసర్లు 57 వికెట్లు పడగొట్టారు. మొత్తంమీద ఈ ఏడాది భారత పేసర్లు ఇప్పటివరకు 23.70 సగటుతో 179 వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications