

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాలో భారత్ గెలిచింది. దీంతో సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. 4 వికెట్ల నష్టానికి భారత్ 168 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఫించ్ (28), షార్ట్ (33) మంచి ఆరంభాన్నిచ్చినా.. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కట్టడి చేశారు.
ముఖ్యంగా కృనాల్ పాండ్యా.. నాలుగు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. భారత్‌కు 165 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. ఆతిథ్య బ్యాట్స్‌మెన్ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా టీమిండియా జాగ్రత్తపడింది. కాగా చివరి ఐదు ఓవర్లలో సగటున 8 పరుగులు ఇవ్వడంతో స్కోరు పెరిగింది. డీఆర్సీ షార్ట్ (33), ఆరోన్ ఫించ్ (28) రాణించారు. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో 4/36తో అత్యుత్తమ గణాంకాలు నెలకొల్పాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఫించ్, షార్ట్ తొలి వికెట్‌కు 68 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఫించ్‌ను ఔట్‌చేయడం ద్వారా కుల్‌దీప్ ఆ జోడీని విడదీసినట్లు అయింది. జట్టు స్కోరు 73 వద్ద వరుస బంతుల్లో షార్ట్, మెక్‌డెర్మాట్ (0)ను కృనాల్ పెవిలియన్ పంపించాడు. అదే జోరులో 90 వద్ద మాక్స్‌వెల్ (13), 119 వద్ద అలెక్స్ కారీ (27)ను ఔట్ చేశాడు. దీంతో ఆసీస్ స్కోరు వేగం మందగించింది.
క్రిస్ లిన్ (13), స్టొయినిస్ (25 నాటౌట్) క్రీజులో ఉండటంతో చివరి ఐదు ఓవర్లలో పరుగులు చేస్తారన్న ఆత్మవిశ్వాసం కంగారూల్లో కనిపించింది. జట్టు స్కోరు 131వద్ద అనవసర పరుగుకు ప్రయత్నించి లిన్ రనౌట్ అయ్యాడు. చివర్లో భువి, బుమ్రా, కృనాల్ బౌలింగ్‌లో స్టొయినిస్, కౌల్టర్ నైల్ (13 నాటౌట్) బౌండరీలు బాది స్కోరును 164/6కు పెంచారు. కానీ.. భువీ, ఖలీల్, బుమ్రా మ్యాచ్‌లో కనీసం ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోగా.. అందరి ఎకానమీ 8.25కి పైనే ఉండటం విశేషం. ఫీల్డింగ్ సైతం పేలవంగా ఉంది. ఆపగలిగే బౌండరీలనూ అడ్డుకోలేదు.