న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిడ్నీ టీ20: కేఎల్ రాహుల్‌ జట్టులో అవసరమా?, నెటిజన్ల జోకులు

India vs Australia 3rd T20 : Fans Trolling KL Rahul After Another Batting Failure
India vs Australia 3rd T20I: Fans slam KL Rahul after another batting failure

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై వరుసగా మూడో టీ20లోనూ దారుణంగా విఫలమైన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో 20 బంతులాడిన కేఎల్ రాహుల్ కేవలం 14 పరుగులే చేసి ఔటయ్యాడు.

రెండో బంతికే సిక్స్ బాదినా కేఎల్ రాహుల్

రెండో బంతికే సిక్స్ బాదినా కేఎల్ రాహుల్

ఈ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే సిక్స్ బాదినా కేఎల్ రాహుల్ ఆ తర్వాత 18 బంతుల్లోనూ 8 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ విఫలమైన కోహ్లీ (61 నాటౌట్), ధావన్ (41) దూకుడుగా ఆడటంతో 165 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

తొలి టీ20లో కూడా కేఎల్ రాహుల్‌ విఫలం

తొలి టీ20లో కూడా కేఎల్ రాహుల్‌ విఫలం

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో కూడా కేఎల్ రాహుల్‌ విఫలమయ్యాడు. 12 బంతుల్లో 13 పరుగులు చేసి స్టంపౌటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దైంది.

 ఇంగ్లాండ్‌ పర్యటనలో అతను సాధించిన

ఇంగ్లాండ్‌ పర్యటనలో అతను సాధించిన

దీంతో మూడు టీ20లోనైనా రాణిస్తాడని భావిస్తే, ఇందులో కూడా రాహుల్ ఫెయిలయ్యాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో అతను సాధించిన అద్భుత సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్‌ లేదు. అయినా టీమిండియా మేనేజ్‌మెంట్‌ రాహుల్‌పై నమ్మకం ఉంచి అవకాశం కల్పించగా.. అతను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.

 రాహుల్‌ తమ ఓపికను పరీక్షిస్తున్నాడని నెటిజన్ల జోకులు

రాహుల్‌ తమ ఓపికను పరీక్షిస్తున్నాడని నెటిజన్ల జోకులు

దీంతో ఇంకెన్నీ అవకాశాలిస్తారని, రాహుల్‌ తమ ఓపికను పరీక్షిస్తున్నాడని నెటిజన్లు ట్విట్టర్‌లో జోకులు వేస్తున్నారు. రాహుల్‌ మంచి బ్యాట్స్‌మనే కానీ అతను నెట్స్‌లో మాత్రమే ఆడుతాడని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే వన్డే జట్టులో సుస్థిర స్థానం దక్కకపోవడంతో ఒత్తిడిలో ఉన్న కేఎల్ రాహుల్ తాజాగా టీ20ల్లోనూ విఫలమవడంతో.. అతని కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారనుంది.

Story first published: Monday, November 26, 2018, 12:22 [IST]
Other articles published on Nov 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X