Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడో టీ20 రద్దు: హెచ్‌సీఏ నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో జోకులే జోకులు

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరగాల్సిన మూడో టీ20 రద్దు కావడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాన్నాళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్నారు.

అయితే, శుక్రవారం వర్షం పడకపోయినప్పటికీ, మైదానంలోని అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో పలుమార్లు పరిశీలించిన అంఫైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం హెచ్‌సీఏ నిర్లక్ష్యం కారణంగా తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ రద్దు అయిందని అభిమానులు మండిపడుతున్నారు.

హైదరాబాద్‌ని గత కొన్ని రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో టీ20కి ముందు ఉప్పల్ స్టేడియంలో అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ ఉందని, ఎంత వర్షం పడినా రెండు గంటలు తెరిపిస్తే మ్యాచ్‌కు గ్రౌండ్‌ను సిద్ధం చేస్తామని హెచ్‌సీఏ ఘనంగా ప్రకటించింది.

హెచ్‌సీఏ విఫలం

హెచ్‌సీఏ విఫలం

అయితే అందుకు తగ్గట్టుగా మ్యాచ్‌ని జరిగేలే చేయడంలో హెచ్‌సీఏ విఫలమైంది. దీంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో హెచ్‌సీఏపై అసహనం వ్యక్తం చేశారు. ‘హెచ్‌సీఏ మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైంది. స్టేడియం నిర్వహకులు మ్యాచ్‌ను నిర్వహించడంలో విఫలమయ్యారు' అని ఓ నెటిజన్ అన్నారు.

 వర్షం లేకపోయినా మ్యాచ్‌ రద్దవడం హాస్యాస్పదం

వర్షం లేకపోయినా మ్యాచ్‌ రద్దవడం హాస్యాస్పదం

'వారికి అసలు క్రికెట్‌పై ఆసక్తే లేదు, వర్షం లేకపోయినా మ్యాచ్‌ రద్దవడం హాస్యాస్పదం, హెచ్‌సీఏకు కావాలంటే ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాన్ని కప్పి ఉంచే కవర్లను అందజేస్తాం. బీసీసీఐ ప్రతినిధులు దయచేసి అలాంటి కవర్లను హైదరాబాద్‌ స్టేడియం నిర్వాహకులకు కొని పెట్టండి' అంటూ ఛలోక్తులు విసిరారు.

 శుక్రవారం వర్షం పడలేదు

శుక్రవారం వర్షం పడలేదు

నిజానికి శుక్రవారం నగరంలో వర్షం పడలేదు. దీంతో స్టేడియంపై కవర్లను తొలగించారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో నగరంలో కాసేపు వర్షం పడింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు స్టేడియం చిత్తడిగా మారింది. కేవలం క్రీజు, 100 యార్డ్స్ సర్కిల్‌ను మాత్రమే కప్పి ఉంచిన సిబ్బంది, 100 యార్డ్స్ సర్కిల్ నుంచి బౌండరీ లైన్ వరకు వదిలేశారు.

అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారడంతోనే ఈ నిర్ణయం

అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారడంతోనే ఈ నిర్ణయం

దీంతో మైదానంలోని అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారి, ఆటకు అనుకూలంగా లేకపోయింది. దీంతో బౌండరీ లైన్ వద్ద నేలను పరిశీలించిన అంపైర్లు స్టేడియం మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా లేదని ప్రకటించారు. ఈ కారణంగానే మూడు టీ20ల సిరిస్‌ విజేత ఎవరో తేల్చే మ్యాచ్ జరగకుండానే టోర్నీ ముగిసింది.

తొలి ప్రయత్నంలోనే విఫలమైన హెచ్‌సీఏ

తొలి ప్రయత్నంలోనే విఫలమైన హెచ్‌సీఏ

అంతేకాదు అంతర్జాతీయ టీ20కి ఆతిథ్యమిచ్చిన తొలి ప్రయత్నంలోనే హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఫెయిలయ్యింది. మ్యాచ్‌ రద్దు కావవడంతో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లిస్తామని హెచ్‌సీఏ ప్రకటించింది. ఏయే రోజుల్లో నగదు తిరిగిచ్చేది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అప్పటివరకూ ప్రేక్షకులు టిక్కెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించింది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+