
నిరాశగా ఇంటిముఖం పట్టిన అభిమానులు
దాంతో అభిమానులు నిరాశగా ఇంటిముఖం పట్టారు. మూడు టీ20ల మ్యాచ్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో 1-1తో సమమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించగా, గువహటిలో జరిగిన రెండో టీ 20లో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అభిమానులతో కిక్కిరిసిన స్టేడియం
కాగా, చాన్నాళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది. ఈ సమయంలో అంఫైర్లు మ్యాచ్ రద్దు నిర్ణయాన్ని తెలియజేయడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. రెండు వారాల కిందటే టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు పోటెత్తడంతో ఆరు గంటలకల్లా గ్యాలరీ నిండిపోయింది. అయితే మైదానం తడిగా ఉందని ఏడు గంటలకు అంఫైర్లు మైదానాన్ని పరిశీలిస్తారని స్టేడియంలోని స్క్రీన్‌పై మెసేజ్ రావడంతో అందరిలో కాస్త ఆందోళన మొదలైంది.
ఏడు గంటలకు పిచ్‌ను పరిశీలించిన అంఫైర్లు
తొలుత ఏడు గంటలకు పిచ్‌ను పరిశీలించిన అంఫైర్లు సంతృప్తి చెందకపోవడంతో అధికారులు 45 నిమిషాల తర్వాత మళ్లీ పరిశీలిస్తామని తెలిపారు. ఇదే సమయంలో చిన్న చిన్న తుంపర్లు మొదలవడంతో పిచ్‌పైకి కవర్లు తెచ్చారు. వర్షం రాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఆటగాళ్లు ఒక్కొక్కరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకోవడం చూస్తే అప్పటికే మ్యాచ్ అసాధ్యమని ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

హెచ్‌సీఏ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదా?
నగరంలో గత పదిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మ్యాచ్‌పై ముందు నుంచే అనుమానాలు నెలకొన్నాయి. కానీ, ఎంత వానొచ్చినా.. మ్యాచ్‌కు ముందు రెండు గంటలు తెరిపిస్తే మైదానాన్ని సిద్ధం చేస్తామని హెచ్‌సీఏ అధికారులు చెబుతూ వచ్చారు. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉందని, రెండు సూపర్ సాపర్లు అందుబాటులో ఉన్నాయని.. అవుట్ ఫీల్డ్‌ను మొత్తం కవర్లతో కప్పి ఉంచుతున్నామని చెప్పారు. అయినా హెచ్‌సీఏ మైదానాన్ని సిద్ధం చేయలేకపోయుంది.

అభిమానులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తాం
మ్యాచ్ రద్దు కావవడంతో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లిస్తామని హెచ్‌సీఏ ప్రకటించింది. ఏయే రోజుల్లో నగదు తిరిగిచ్చేది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అప్పటివరకూ ప్రేక్షకులు టిక్కెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించింది. అయితే, మొత్తం డబ్బు ఇస్తారో లేక పన్నులు ఇతరత్రా చార్జీలు మినహాయించుకుని ఇస్తారనే చర్చ ప్రేక్షకుల్లో నడుస్తోంది.

ప్రేక్షకులు లోపల ఉండగానే తెలివిగా ఆటగాళ్లను హోటల్‌కు
శుక్రవారం రాత్రి 8.15 గంటలకు మ్యాచ్ రద్దు ప్రకటనకు ముందుగానే నిర్వాహకులు కాస్త తెలివిగా వ్యహరించారు. ఇరు జట్ల ఆటగాళ్లను ప్రత్యేక బస్సుల్లో హోటల్‌కు పంపించిన తర్వాత మ్యాచ్ రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. గువహటిలో ఆసీస్ బస్సుపై దాడి జరగడాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications