ముంబై: ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. వరుసగా రెండు వన్డేల్లో ఓడిన భారత్.. మూడో వన్డేలో బెబ్బులిలా చెలరేగింది. మూడో వన్డే గెలిచి క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. అయితే మూడో వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుబ్మాన్ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగి 39 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. వన్డే మ్యాచ్ తర్వాత గిల్ ఆటకు సంబంధించి కొన్ని ఫోటోస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇది అతనికి శాపంలా మారింది.
మ్యాచ్ అనంతరం శుబ్మాన్ గిల్ కొన్ని ఫోటోస్‌ను సోషల్ మెడియల్ షేర్ చేశాడు. దేశానికి ఆడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది అంటూ క్యాప్షన్ జత చేశాడు. అందులో ఒకటి విరాట్ కోహ్లీతో కలిసి 56 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఫోటో. మరొకటి ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో సహచర ఆటగాళ్లతో కలిసి దిగిన గ్రూఫ్ ఫోటో. అయితే గిల్ షేర్ చేసిన రెండో ఫోటోలో తన రెండు చేతులను పాకెట్లో పెట్టుకొని కనిపించాడు. ఆ రెండో ఫొటోలపై టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా.. నువ్వు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు అని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యాడు.
'మహారాజ్..విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసిన ఫోటో చాలా బాగుంది. కానీ రెండో ఫోటోలో ఏంటి?. ఏదో సాధించినట్లు జేబులో చేతలు పెట్టుకొని నిల్చున్నావు. ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా?.. నువ్వు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు. అంత రిలాక్సడ్‌గా ఉంటే ఎలా' అని యువీ ట్వీట్ చేశాడు. యువరాజ్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీమిండియా మూడో వన్డే గెలిచి క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకొని తొలి టీ20లో విజయ ఢంకా మోగించింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లోనూ గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్ చేజార్చుకోవద్దని, రేసులో నిలవాలని ఆసీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.
India vs Australia: రెండు వికెట్లే.. బుమ్రా రికార్డుపై కన్నేసిన చహల్!!