Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడో వన్డే: ఇండోర్‌లో కోహ్లీసేన సాధించిన రికార్డులివే

హైదరాబాద్: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో టీమిండియా 100 శాతం విజయాలను రికార్డుని అలాగే ఉంచుకుంది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది.

భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో వన్డే విజయం కాగా.. ఇప్పటికే టెస్టుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న భారత్‌, ఈ విజయంతో వన్డేల్లోనూ అగ్రస్థానాన్ని సాధించింది. మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 293 పరుగులు చేసింది.

ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఆరోన్ ఫించ్ (125 బంతుల్లో 124; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ స్మిత్ (71 బంతుల్లో 63; 5 ఫోర్లు), వార్నర్ (44 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ప్రదర్శన చేశారు. అనంతరం 294 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని భారత్‌ 13 బంతులుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఓపెనర్లు రోహిత్‌ శర్మ (71; 62 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు), అజింక్య రహానె (70; 76 బంతుల్లో 9 ఫోర్లు) ఛేదనలో బలమైన పునాది వేస్తే.. తర్వాత హార్దిక్‌ పాండ్యా (78; 72 బంతుల్లో 5 ఫోర్లు, 4 ఫోర్లు), మనీష్‌ పాండే (36 నాటౌట్‌; 32 బంతుల్లో 6 పోర్లు) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుని గెలిపించారు.

ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో పాండ్యా రెండో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' సాధించాడు. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

ఇండోర్ స్టేడియంలో 100 శాతం విజయాల రికార్డు

ఇండోర్ స్టేడియంలో 100 శాతం విజయాల రికార్డు

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్ విజయాల రికార్డు 5-0గా నమోదైంది. గతంలో ఇక్కడ ఆడిన నాలుగు వన్డేలు, ఓ టెస్టులో టీమిండియానే నెగ్గింది. ఈ స్టేడియంలో టీమిండియా ఓటమన్నదే ఎరుగదు. ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆసీస్‌పై విజయం సాధించి దానిని కొనసాగించింది.

కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా 9 వన్డేల్లో విజయం సాధించింది.

కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా 9 వన్డేల్లో విజయం సాధించింది.

తద్వారా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుని కోహ్లీ సమం చేశాడు. మరో మ్యాచ్‌ గెలిస్తే వరుసగా అత్యధిక వన్డేల్లో భారత్‌ను గెలిపించిన కెప్టెన్‌‌గా కోహ్లీ నిలుస్తాడు. అదే సమయంలో కోహ్లీ వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం క్లైవ్ లాయిడ్, వివ్ రిచర్డ్స్‌ల రికార్డుని సమం చేశాడు. తన 38 వన్డేల్లో కెప్టెన్‌గా కోహ్లీకి ఇది 30వ విజయం. వన్డేల్లో అత్యధిక విజయాలనందించిన కెప్టెన్‌గా ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ అగ్రస్ధానంలో ఉన్నాడు.

ఈ సిరిస్‌లో పాండ్యాకు రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు

ఈ సిరిస్‌లో పాండ్యాకు రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు

ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో పాండ్యా రెండో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' సాధించాడు. అంతేకాదు వన్డేల్లో పాండ్యా అర్ధసెంచరీల సంఖ్య 4. అన్ని ఈ సీజన్‌లోనే 100 స్ట్రయిక్ రేట్‌తో చేయడం విశేషం.

వన్డేల్లో వరుసగా 6 సిరిస్ విజయాలు

వన్డేల్లో వరుసగా 6 సిరిస్ విజయాలు

వన్డేలో టీమిండియా వరుసగా ఆరు సిరీస్ విజయాలు సొంతం చేసుకుంది. ఆసీస్‌పై మూడో వన్డేలో గెలుపుతో కోహ్లీసేన ఈ రికార్డు అందుకుంది. ఇప్పటివరకు వన్డేల్లో భారత్ సాధించిన వరుస విజయాలు 9. వెస్టిండీస్‌తో ఆఖరి వన్డే గెలుపుతో మొదలు శ్రీలంకపై 5-0తో క్లీన్‌స్వీప్, ఆస్ట్రేలియాపై ప్రస్తుతం 3-0తో వరుసగా 9 విజయాలు సొంతం చేసుకుంది. గతం(2008-09)లో ధోనీ కెప్టెన్సీలో నమోదైన రికార్డును కోహ్లీసేన సమం చేసింది.

మూడేళ్ల తర్వాత సెంచరీ భాగస్వామ్యం

మూడేళ్ల తర్వాత సెంచరీ భాగస్వామ్యం

2014 తర్వాత భారత్ ఓపెనింగ్ (రోహిత్-రహానే) జోడీ స్వదేశంలో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. గతంలో కటక్‌లో ధావన్-రహానేల జోడీ శ్రీలంకపై 231 పరుగులు చేశారు.

ఆరోన్ ఫించ్ చేసిన సెంచరీల సంఖ్య 3

ఆరోన్ ఫించ్ చేసిన సెంచరీల సంఖ్య 3

విదేశాల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ పించ్ చేసన సెంచరీల సంఖ్య 3. ఆసియాలో ఆడిన గత 14 ఇన్నింగ్స్‌లో అతడికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

ఆస్ట్రేలియాపై ఇదే తొలిసారి

ఆస్ట్రేలియాపై ఇదే తొలిసారి

ఆస్ట్రేలియాపై ఐదు వన్డేల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లుండగానే భారత్‌ గెలవడం ఇదే తొలిసారి. విదేశాల్లో ఆస్ట్రేలియా వరుసగా గెలుపు రుచి చూడని మ్యాచ్‌లు 13. ఇందులో 11 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవగా... రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+