న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెల్‌బోర్న్‌లో 3rd ODI: ఆరోన్ ఫించ్‌కు భువనేశ్వర్ గండం, హ్యాట్రిక్ (వీడియో)

India vs Australia 3rd ODI : Bhuvneshwar Kumar Gets Aussie Skipper Finch With A Beauty | Oneindia
India Vs Australia, 3rd ODI, Live Updates: Bhuvi Gets Aussie Skipper Finch With a Beauty

హైదరాబాద్: ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తన ఆధిపత్యాన్ని మరోసారి కొనసాగించాడు. శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభమైన మూడో వన్డేలోనూ పింఛ్‌ను 14 పరుగులకే పేసర్ భువనేశ్వర్ కుమార్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

బంతి సుప్రీం కోర్టులో: గందరగోళంలో పాండ్యా, రాహుల్ భవిష్యత్తు!బంతి సుప్రీం కోర్టులో: గందరగోళంలో పాండ్యా, రాహుల్ భవిష్యత్తు!

దీంతో వరుసగా మూడు వన్డేల్లోనూ అరోన్ ఫించ్‌ని ఆరంభంలోనే ఔట్ చేసిన భువీ 'హ్యాట్రిక్' ఆధిపత్యాన్ని నమోదు చేశాడు. అంతేకాదు ఈ పర్యటనలో ఇప్పటి వరకూ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడిన భారత్.. ఆ జట్టు ఓపెనర్ అరోన్ ఫించ్‌ని మాత్రం కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకుండా ఔట్ చేసింది.

ఫించ్ చివరగా ఆడిన 11 ఇన్నింగ్స్‌ల్లో

ఆరోన్ ఫించ్ చివరగా ఆడిన 11 ఇన్నింగ్స్‌ల్లో అతడి అత్యధిక స్కోరు 47 కాగా.. ఏకంగా ఏడు సార్లు 7 పరుగులలోపే పెవిలియన్ చేరడం విశేషం. జింబాబ్వేతో గతేడాది జూలైలో జరిగిన టీ20లో కేవలం 76 బంతుల్లోనే 172 పరుగులు చేశాడు. దీంతో భారత్‌పై సుదీర్ఘ సిరీస్‌లో అతను చెలరేగిపోతాడని అంతా భావించారు.

అతడిపై పెట్టుకున్న అంచనాలు తలకిందులు

అతడిపై పెట్టుకున్న అంచనాలు తలకిందులు

అయితే, అతడిపై పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఆ సెంచరీ తర్వాత ఇప్పటి వరకూ అన్ని ఫార్మాట్లలో కలిపి 26 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆరోన్ ఫించ్ కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించాడు. భారత్‌పై తాజా సిరీస్‌లో చివరిగా ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో అతని అత్యధిక స్కోరు 47 కాగా.. ఏకంగా ఎనిమిదిసార్లు 7 పరుగులలోపే ఫించ్ పెవిలియన్ చేరాడు.

మూడు వన్డేల సిరిస్‌లో

మూడు వన్డేల సిరిస్‌లో

ప్రస్తుతం జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 11 బంతులు ఎదుర్కొన్న అరోన్ ఫించ్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే భువీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలోనూ 19 బంతులు ఎదుర్కొని మళ్లీ 6 పరుగుల వద్దే భువీ బౌలింగ్‌లో బంతిని వికెట్లపైకి ఆడుకుని ఔటయ్యాడు.

1
43629
Story first published: Friday, January 18, 2019, 11:07 [IST]
Other articles published on Jan 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X