పదో ఇన్నింగ్‌కి ఫామ్‌లోకి వచ్చాడు: హాఫ్ సెంచరీలతో మెరిసిన ఫించ్, ఖవాజా

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ఆరోన్ ఫించ్ ఎట్టలేకు తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. గత కొంతకాలంగా పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తున్న ఫించ్.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6 బాదిన ఫించ్ 51 బంతుల్లో 7 పోర్లు, 3 సిక్సుల సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో ఆరోన్ ఫించ్‌కి ఇది 19వ హాఫ్ సెంచరీ కాగా, గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఇదే హాఫ్ సెంచరీ కావడం విశేషం. గత 9 ఇన్నింగ్స్‌ల్లో 22, 5, 41, 11, 6, 6, 14, 0, 37 పరుగులు చేశాడు.
ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ
ఆరోన్ ఫించ్‌తో పాట మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా 62 బంతుల్లో 54 పరుగులతో హాఫ్ సెంచరీని సాధించాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతుండటంతో 22 ఓవర్లకు గాను ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 133 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఆరోన్ ఫించ్ (68), ఉస్మాన్ ఖవాజా(58) పరుగులతో క్రీజులో ఉన్నారు.
మ్యాచ్ ఆరంభంలోనే రివ్యూ మిస్
కాగా, మ్యాచ్ ఆరంభంలోనే కోహ్లీసేన రివ్యూ (డీఆర్‌ఎస్) అవకాశాన్ని చేజార్చుకుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతి అతని బ్యాట్‌కి అందకుండానేరుగా వెళ్లి ఫ్యాడ్స్‌ను తాకింది. దీంతో ఎల్బీ ఔట్ కోసం భారత క్రికెట్ జట్టు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ
అయితే, బుమ్రా మాటని అతిగా విశ్వసించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రివ్యూకి వెళ్లగా బంతి వికెట్లని తాకకుండా పైన వెళ్తున్నట్లు రిప్లైలో కనిపించింది. దీంతో టీమిండియాకి ఉన్న ఏకైక రివ్యూని ఆరంభంలోనే చేజార్చుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐదు వన్డేల సిరిస్‌లో 2-0 ఆధిక్యంలో
ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన భారత్ జట్టు 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా.. మరోవైపు మూడో వన్డేలో గెలిచి ఈ సిరిస్‌లో ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలని ఆసీస్ భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications