For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ సెంచరీ వృధా: రాంచీ వన్డేలో పోరాడి ఓడిన టీమిండియా

India vs Australia,3rd ODI : Kohli's 41st Hundred Not Enough As India Lose Ranchi ODI To Australia
Virat Kohli

హైదరాబాద్: రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 314 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 281 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా, కమిన్స్, రిచర్డ్‌సన్ తలో మూడు వికెట్లు తీసుకోగా... నాథన్ లియాన్‌కు ఒక వికెట్ లభించింది. ఈ విజయంతో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే మార్చి 10న మొహాలీ వేదికగా జరగనుంది.

ఓపెనర్లు విఫలం

ఓపెనర్లు విఫలం

ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌(1) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ(14) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు(2)ని కమిన్స్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది.

నాలుగో వికెట్‌‌కు 59 పరుగులు

నాలుగో వికెట్‌‌కు 59 పరుగులు

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌‌కు 59 పరుగులు జోడించిన తర్వాత ధోని(26) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత జాదవ్‌తో కలిసి 88 పరుగుల్ని కోహ్లీ జోడించాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 174 పరుగుల వద్ద జాదవ్‌ ఔట్‌ కాగా, విజయ్‌ శంకర్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌‌ని ముందుకు నడిపించాడు.

వన్డేల్లో కోహ్లీ 41వ సెంచరీ

వన్డేల్లో కోహ్లీ 41వ సెంచరీ

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సెంచరీని సాధించాడు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడుతున్న కోహ్లీ(123) ఆడమ్ జంపా బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4000 పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా 4000 పరుగులు సాధించడానికి కోహ్లీకి పట్టిన ఇన్నింగ్స్‌ 63.

అంతకముందు 313 పరుగులు చేసిన ఆసీస్

అంతకముందు ఓపెనర్లు ఆరోన్ ఫించ్(93), ఉస్మాన్ ఖవాజా(104) సెంచరీతో చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. ఆసీస్ హిట్టర్ మాక్స్‌వెల్(47: 31 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, మహ్మద్ షమీ ఒక వికెట్ తీశారు.

Story first published: Friday, March 8, 2019, 21:52 [IST]
Other articles published on Mar 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+