Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ధావన్-రోహిత్ ఆడుతున్నారు!!

India Vs Australia,3rd ODI: Toss Report | Australia Elects To Bat In ODI Decider | Hazlewood In
India vs Australia 3rd ODI: Australia have won the toss and have opted to bat

ముంబై: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మరోకొద్ది సేపట్లో చివరిదైన మూడో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్ విన్నింగ్స్ జట్టునే కొనసాగిస్తోంది. మరోవైపు ఆసీస్ మాత్రం ఒక మార్పు చేసింది. పేసర్ రిచర్డ్‌సన్‌ స్థానంలో హజిల్‌వుడ్‌ జట్టులోకి వచ్చాడు.

ముంబైలో జరిగిన తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో టీమిండియాను మట్టికరిపిస్తే.. రాజ్‌కోట్‌లో సమిష్ఠిగా చెలరేగిన కోహ్లీసేన బదులు తీర్చుకున్నారు. సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండగా.. ఈ మ్యాచ్‌ గెలిచిన జట్టు ఖాతాలో సిరీస్‌ చేరుతుంది. వన్డే క్రికెట్‌లో అత్యంత పటిష్ఠమైన జట్ల మధ్య మ్యాచ్ కాబట్టి హోరాహోరీ పోరును ఆశించవచ్చు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో భళా అనిపించి సిరీస్‌ చేజిక్కించుకునేది ఎవరో చూడాలి.

2013లో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఆసీస్‌తో జరిగిన వన్డేలో రోహిత్‌ శర్మ (209) డబుల్‌ సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక రెండున్నరేళ్ల క్రితం (2017, సెప్టెంబర్‌) జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్లకు 334 పరుగులు చేసింది. వార్నర్‌ (124), ఫించ్‌ (94), హ్యాండ్స్‌కోంబ్‌ (43) దంచి కొట్టడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రోహిత్‌ (65), అజింక్య రహానే (53), కేదార్ జాదవ్‌ (67), హార్దిక్ పాండ్యా (41) రాణించినా.. టీమిండియా 313/8కే పరిమితమైంది.

జట్లు:
భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధావన్, అయ్యర్‌, రాహుల్‌, పాండే, జడేజా, బుమ్రా, కుల్దీప్‌, సైనీ, షమీ.
ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌, కారీ, టర్నర్‌, అగర్‌, కమిన్స్‌, స్టార్క్‌, హజిల్‌వుడ్‌, జంపా.

Story first published: Sunday, January 19, 2020, 13:14 [IST]
Other articles published on Jan 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+