
నవ్‌దీప్ సైనీని తీసుకోవడం..
వెన్నుగాయంతో ఇబ్బంది పడుతున్న నవ్‌దీప్ సైనీని జట్టులోకి తీసుకోవడం భారత్ విజయవకాశాలపై ప్రభావం చూపింది. అతని వెన్ను గాయం కారణంగానే టీ20లకు మాత్రమే ఎంపిక చేసిన టీ నటరాజన్‌ను బ్యాకప్‌గా వన్డే జట్టులోకి తీసుకున్నారు. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైనీనే తుది జట్టులోకి తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన సైనీ 83 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, రెండు సిక్స్లున్నాయి. ఇక వరుసగా మూడు ఫోర్లు కూడా ఇచ్చాడు. అతనికి బదులు నటరాజన్ లేక శార్ధుల్ను తీసుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

కోహ్లీ నిర్లక్ష్యపు బ్యాటింగ్..
ఇక భారీ లక్ష్య చేధనలో క్రీజులోకి వచ్చిన విరాట్ బాధ్యత మరచి ఆడటం కూడా భారత ఫలితంపై ప్రభావం చూపింది. మయాంక్ ఔటైన వెంటనే ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో కోహ్లీ నిర్లక్ష్యపు షాట్ ఆడాడు. కానీ జంపా జారవిడచడంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ అవకాశంతో విరాట్.. రెండు ఫోర్లు, ఒక క్లాసీ సిక్స్‌తో దూకుడు కనబర్చాడు. కానీ ఆ వెంటనే జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో మరో రెక్లెస్ షాట్‌తో ఫించ్‌కు చిక్కాడు. మూడో స్థానంలో వచ్చిన స్మిత్ తరహాలో కోహ్లీ ఆచితూచి ఆడుంటే.. కొంతైనా అవకాశం ఉండేది.

ఫీల్డింగ్ ప్లేస్మెంట్..
మైదానంలో ఫీల్డింగ్ ప్లేస్మెంట్ అనేది కెప్టెన్ సత్తాకు నిదర్శనం. బౌలర్లతో వ్యూహాలు రచిస్తూ వారు వేసే బంతులకు తగ్గట్లు ఫీల్డింగ్ పెట్టి ఫలితం రాబట్టాలి. కానీ ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఫీల్డింగ్ ప్లేస్మెంట్లో ఘోర తప్పిదాలు చేశాడు. ఫలితంగా భారత ఆటగాళ్లు మైదానంలో పదేపదే తప్పిదాలు చేశారు. ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా ఈ ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఫించ్, స్మిత్.. గ్యాప్స్‌లో ఆడుతూ పరుగులు రాబట్టారు. మ్యాక్స్‌వెల్ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని చెలరేగాడు. ఇక డెత్ ఓవర్లలో ఫీల్డర్లను సర్కిల్ లోపల ఉంచే వ్యూహం ఏంటో అర్థం కాలేదు. చెత్త ఫీల్డింగ్‌తో భారత్ మూల్యం చెల్లించుకుంది.

స్మిత్, ఫించ్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరోన్ ఫించ్ ( 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్‌లతో 114), స్టీవ్ స్మిత్ (66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్ (76 బంతుల్లో 6ఫోర్లతో 69), గ్లెన్ మాక్స్వెల్ (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ (3/59) మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్యా( 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90), శిఖర్ ధావన్(86 బంతుల్లో 10 ఫోర్లతో 74) రాణించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు, హజల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. స్టార్క్ ఓ వికెట్ తీశాడు.
India vs Australia: కోహ్లీ X రోహిత్ వైరం.. టీమిండియా కొంపముంచుతుందా?