ప్రశాంతంగా లేను.. బయటికి చూపించలేదంతే: కోహ్లీ

అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంతో శుభారంభాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు తమ సహనాన్ని పరీక్షిస్తూ మ్యాచ్‌ను దూరం చేస్తుంటే మాత్రం కూల్‌గా ఉండలేకపోయానన్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే తన అసహనాన్ని బయటికి ప్రదర్శించలేదనే తెలిపాడు.

ఒడిదుడుకులు సహజమే..
టెస్లుల్లో ఒడిదుడుకులు సహజం. ఆసీస్ ఆటగాళ్లు ఆటలో గొప్పగా పోరాడారు. అయితే వారిని మాత్రం అడ్డుకోవడంలో సఫలమైయ్యాం. నా అసహనాన్ని బయటకు ప్రదర్శించలేదు. మా బౌలర్లను చూసి గర్వపడుతున్నాను. మ్యాచ్ అంతా ప్రశాంతంగా ఉన్నానని చెప్పలేను. విదేశాల్లో ఎప్పుడూ చేయని విధంగా నలుగురు బౌలర్లతో 20 వికెట్లు తీసి విజయం సాధించగలిగాం.

పూజారా ఏకాగ్రతే గెలిపించింది
పుజారా ప్రదర్శన వెలకట్టలేనిది. అతడి ఏకాగ్రత, పట్టుదల మమ్మల్ని పోటీలో నిలిచేలా చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో వచ్చిన 15 పరుగుల ఆధిక్యం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానె అద్భుతంగా ఆడారు. అయితే మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నిరాశపర్చారు. వారు మరో 30-35 పరుగులు చేసి ఉండాల్సింది. సిరీస్‌ను 1-0తో ప్రారంభించడం ఆనందంగా ఉంది.

'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచి
ఈ మ్యాచ్‌లో పుజారా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 194 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన విషయం తెలిసిందే. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 31 పరుగుల తేడాతో కోహ్లీ సేన గెలుపొంది సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది. బౌలర్లు రాణించడంతో ఆసీస్ గడ్డపై టీమిండియా సిరీస్‌లో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.

తొలి టెస్టులో తొలిసారి విజయం
ఈ విజయంతో 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ సందర్భంగా నమోదైన గణాంకాలివీ. 2008 తర్వాత ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు విజయాన్ని నమోదు చేసింది. రాహుల్ ద్రవిడ్, ధోని కెప్టెన్సీలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల్లో భారత్ టెస్టు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ.. ఆస్ట్రేలియాలో మాత్రం గెలవలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications