హైదరాబాద్: బెంగుళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 23, రెన్ షా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌటైంది.
క్యాచ్ మిస్: అవుట్ నుంచి తప్పించుకున్న వార్నర్
బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు లైఫ్ లభించింది. ఇషాంత్ శర్మ వేసిన 6.2వ బంతి వార్నర్ బ్యాట్ అంచుకు తగిలి స్లిప్‌లో గాల్లోకి లేచింది. ఈ క్రమంలో గల్లీలో ఉన్న రహానే అద్భుతంగా డైవ్ చేయడంతో బంతి చేతికి చిక్కినట్లే చిక్కి చేజారింది. దీంతో వార్నర్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. ప్రస్తుతం వార్నర్ 10, రెన్ షా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా
బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, రేన్ షాలు ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 10 పరుగులు చేసింది. ప్రస్తుతం రేన్ షా 4, వార్నర్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
189 పరుగులకే ఆలౌటైన టీమిండియా
బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 189 పరుగులకే ఆలౌటైంది. పూణె టెస్టు మాదిరే మరోసారి ఆస్ట్రేలియా స్పిన్ ఉచ్చులో కోహ్లీ సేన పడింది. టీమండియా బ్యాటింగ్ లైనప్‌ను ఆసీస్ స్పిన్నర్ లియాన్ కూల్చేశాడు. లియాన్ ఒక్కడే 8 వికెట్లు తీసుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 205 బంతుల్లో 90 పరుగులు చేశాడు. ఈ 90 పరుగుల్లో 9 ఫోర్లు ఉన్నాయి. క్రీజులోకి వచ్చిన వారంతా వరుసగా పెవిలియన్‌కు చేరుతున్నా కేఎల్ రాహుల్ మాత్రం నిలకడగా ఆడాడు.
భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా 17, కోహ్లీ 12, రహానే 17, నాయర్ 26, అశ్విన్ 7, సాహా 1, జడేజా 3 పరుగులు చేయగా అభినవ్ ముకుంద్, ఇషాంత్ శర్మలు డకౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ 8 వికెట్లు తీసుకోగా ఓకీఫ్, మిచెల్ స్టార్క్ చెరో వికెటీ తీసుకున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్ సాగిందిలా:
ఎనిమిది వికెట్లు కోల్పోయిన టీమిండియా
రెండో టెస్టులో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా అవుటైన తర్వాత బ్యాటింగ్ దిగిన జడేజా 16 బంతుల్లో మూడు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఒకే ఒక్క పరుగుతో పెవిలియన్‌కు చేరిన వృద్ధిమాన్ సాహా
రెండో టెస్టులో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. అశ్విన్ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా కేవలం ఒకే ఒక్క పరుగుతో పెవిలియన్‌కు చేరాడు. 66 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 187 పరుగులు చేసింది. ప్రస్తుతం జడేజా 3, రాహుల్ 88 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అశ్విన్ అవుట్: ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
రెండో టెస్టులో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ 14 బంతుల్లో 7 పరుగులు చేసి అవుటయ్యాడు. అశ్విన్ అవుటైన తర్వాత క్రీజులోకి వృద్ధిమాన్ సాహా వచ్చాడు. 65 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 177 పరుగులు చేసింది. మరోవైపు ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం లోకేష్ రాహుల్ 85, సాహా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
టీ విరామానికి టీమిండియా 168/5
బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. టీ విరామానికి 5 వికెట్లను కోల్పోయిన భారత్ 168 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 79, రవిచంద్రన్ అశ్విన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కష్టాల్లో భారత్: కరుణ్ నాయర్ అవుట్
రెండో టెస్టులో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కరుణ్ నాయర్ రూపంలో భారత్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓకీఫ్ బౌలింగ్‌లో నాయర్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో 58 ఓవర్లకు గాను టీమిండియా 5 వికెట్లను కోల్పోయి 160 పరుగులు చేసింది.
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
రెండో టెస్టులో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. కేవలం 17 పరుగులు మాత్రమే చేసిన రహానే లియాన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. మొదటి టెస్టులో విఫలమయిన రహానే, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. మ్యాచ్ ప్రారంభం నుంచీ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం భారత్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయిన టీమిండియా 124 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 67, కరుణ్ నాయర్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కోహ్లీ అవుట్: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
రెండో టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లియోన్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 34 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. మరోవైపు ఓపెనర్ రాహుల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు ప్రస్తుతం ఓపెనర్ కేఎల్ రాహుల్ 52, రాహానే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ
బెంగుళూరులో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధసెంచరీని నమోదు చేశాడు. 105 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధసెంచరీని సాధించాడు. టెస్టుల్లో కేఎల్ రాహుల్‌కిది మూడో అర్ధసెంచరీ. ప్రస్తుతం భారత్ 32 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. రాహుల్ 51, కోహ్లీ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లంచ్ విరామానికి టీమిండియా 72/2
బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా లంచ్ విరామానికి 2 వికెట్లను కోల్పోయి 72 పరుగులు చేసింది. లంచ్ విరామానికి ముందు లియాన్ బౌలింగ్‌లో పూజారా అవుటయ్యాడు. దీంతో ప్రస్తుతం కేఎల్ రాహుల్ క్రీజులో 48 పరుగులతో ఉన్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
రెండో టెస్టులో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లియాన్ బౌలింగ్‌లో పూజారా, హ్యాండ్స్‌కోంబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 61 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో లంచ్ సెషన్‌లోపే టీమిండియా రెండు వికెట్లను కోల్పోయింది. మరో ఎండ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నాడు.
బెంగుళూరు టెస్టు: 50 పరుగులను దాటిన టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా ఆడుతోంది. ఒకీఫ్ వేసిన 19.1 బంతిని కేఎల్ రాహుల్ స్వీప్ చేసి ఒక పరుగు రాబట్టడంతో టీమిండియా 50 పరుగుల మైలురాయి దాటింది. 22 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 42, ఛటేశ్వర్ పుజారా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
నిలకడగా ఆడుతోన్న టీమిండియా
బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ క్రీజులో పాతుకుపోయేందుకు నిలకడగా ఆడుతున్నాడు. అతనికి ఛటేశ్వర్ పుజారా తన వంతు సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 31, ఛటేశ్వర్ పుజారా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ: ముకుంద్ అవుట్
బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 11 పరుగుల వద్ద ఓపెనర్ అభినవ్ ముకుంద్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. మూడో ఓవర్‌లో స్టార్క్ వేసిన యార్కర్ లెంగ్త్ బంతిని అంచనా వేయలేక ఎల్బీగా వెనుదిరిగాడు.
తమిళనాడు బ్యాట్స్‌మన్ అభినవ్ ముకుంద్‌కు దాదాపు ఐదున్నరేళ్ల విరామం తర్వాత భారత టెస్టు జట్టులో ఆడే అవకాశం వచ్చింది. అయితే దీనిని అభినవ్ ముకుంద్ సద్వినియోగ పరచుకోలేక పోయాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా 7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 17, ఛటేశ్వర్ పుజారా పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచిన టీమిండియా
బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఈ టెస్టులో గెలవాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది.
తుది జట్టులో రెండు మార్పులు
భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ఓపెనర్ మురళీ విజయ్ గాయపడటంతో అతని స్థానంలో అభినవ్ ముకుంద్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు జయంత్ యాదవ్‌ను తప్పించి అతడి స్ధానంలో కరుణ్ నాయర్‌ను తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు.
రెండో టెస్టులో భారత్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి టెస్టు లోపాలను సరిదిద్దుకొని సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది. మరోవైపు తొలి టెస్టులో విజయం సాధించి మంచి ఊపుమీదున్న ఆసీస్ అదే జోరుని కొనసాగించాలని కోరుకుంటోంది.
బెంగళూరు టెస్టులో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. పూణె టెస్టులో భారత్ 333 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలో ముందుగా స్పోర్టింగ్ వికెట్‌ను తయారు చేస్తున్నామని స్థానిక క్యూరేటర్ చెప్పాడు. దాంతో, మొన్నటిదాకా పిచ్‌పై పచ్చిక కనిపించింది.
కానీ, శుక్రవారం నాటికి పచ్చికను రెండుసార్లు తొలగించారు. ఇప్పుడిది సాధారణ ఉపఖండపు వికెట్‌గా మారిపోయింది. పిచ్ పొడిగా ఉండడంతో తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు ఆ తర్వాత స్పిన్‌కు అనుకూలించే అవకాశముంది.