బెంగళూరు: బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు (ఆదివారం) స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఆర్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో డేవిడ్ వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్.. అశ్విన్ బంతిని స్ట్రయిట్ డ్రైవ్ ఆడాడు. బంతి నేరుగా బౌలింగ్ ఎండ్‌లో ఉన్న రెన్షా పక్కకు వచ్చింది.
బంతిని అందుకునేందుకు ప్రయత్నించిన అశ్విన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెన్షా అడ్డుకున్నాడు. దీంతో స్టీవ్ స్మిత్‌తో అశ్విన్, బ్యాటింగ్ వైపు వెళ్లిన రెన్షాతో స్లిప్‌లో ఉన్న విరాట్ వాగ్వాదానికి దిగారు.
స్మిత్, అశ్విన్ మధ్య జరిగిన సంభాషణపై అంపైర్ కలగజేసుకొని వారిద్దరిని వారించాడు.
అశ్విన్ రికార్డు
రవిచంద్రన్ అశ్విన్ మరో రిసార్టు సొంతం చేసుకున్నాడు. రెండో టెస్టులో డ్విడ్ వార్నర్‌ను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఖాతాలో మరో ఘనత చేరింది.
ఈ మ్యాచులో తొలి ఇన్నింగ్సులో అశ్విన్ సంధించిన బంతికి వార్నర్ బౌల్డ్ అయ్యాడు. తద్వారా 12 టెస్టుల్లో ఎనిమిదిసార్లు అశ్విన్ బౌలింగులో వార్నర్ అవుటయ్యాడు. దీంతో తన టెస్టు కెరీర్లో ఒకే అటగాడిని అత్యధికసార్లు అవుట్ చేసిన ఘనతను అశ్విన్ సాధించాడు.