పెర్త్ వేదికగా కుంబ్లే 12ఏళ్ల నాటి రికార్డు బద్దలుకొట్టిన షమీ

పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆటలో ఆసీస్ ఓవర్ నైట్ స్కోరు 132/4తో ఇన్నింగ్స్ ఆరంభించి దూకుడుగా ఆడింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ వేగానికి స్కోరు బోర్డు 250కి మించిన స్కోరు చేస్తుందని ఆశించారంతా. అటువంటి తరుణంలో దూకుడైన ఇన్నింగ్స్‌కు బ్రేక్ వేశాడు షమీ. స్వల్ప వ్యత్యాసంతోనే వికెట్లు పడగొట్టి ఆసీస్ పనిబట్టాడు. ఇలా ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా స్పీడ్‌స్టర్ మొహమ్మద్ షమీ రికార్డు ప్రదర్శన చేశాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరిని షమీ ఔట్ చేశాడు.

నాథన్ లైయన్‌ను ఔట్ చేయడం
ఒక్క రెండో ఇన్నింగ్స్‌లోనే 6 వికెట్లతో చెలరేగిపోయాడు. టెస్టు క్రికెట్ కెరీర్‌లో (6/56) అతనికిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. నాలుగో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు నాథన్ లైయన్‌ను ఔట్ చేయడం ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్‌లో విదేశాల్లో జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

విదేశాల్లో 40కిపైగా వికెట్లు తీసినట్లుగా
2018లో ఐదేసి వికెట్లు తీయడం పేసర్‌కు ఇది రెండోసారి. జనవరిలో దక్షిణాఫ్రికాతో జోహాన్నెస్ టెస్టులో షమీ(5/28) మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 టెస్టులాడిన షమీ 27.07 సగటుతో 42 వికెట్లు పడగొట్టాడు. ఓవర్సీస్ టూర్లలో 2006లో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(41 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును షమీ తాజాగా అధిగమించాడు. ఈ ఇద్దరితో పాటుగా మరో భారత బౌలర్ ఎవ్వరూ ఒక క్యాలెండర్ ఇయర్‌లో విదేశాల్లో 40కిపైగా వికెట్లు తీసినట్లుగా నమోదుకాలేదు.

5 వికెట్లతో 175 పరుగుల దూరంలో
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఎదురీదుతోంది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఇంకో రోజు ఆట మిగిలిన ఈ టెస్టులో భారత్ విజయం సాధించాలంటే 175 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్, హెజెల్‌ఉడ్ చెరో వికెట్లు తీయగా... మిచెల్ స్టార్క్‌కు ఒక వికెట్ లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications