గత 11 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు బౌల్డ్
కేఎల్ రాహుల్ గత 11 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు బౌల్డ్ అయ్యాడు. దీంతో ఓ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక సార్లు బౌల్డ్ అయిన భారత ఓపెనర్ల జాబితాలో కేఎల్ రాహుల్ చేరాడు. మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన 125 టెస్టు మ్యాచ్‌ల కెరీర్‌లో ఈ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకోగా రాహుల్ 33 టెస్టుల్లోనే అందుకోవడం విశేషం.
ఆసీస్ గడ్డపై చెత్త ప్రదర్శన
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అడిలైడ్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అడిలైడ్ టెస్టులో ఆఫ్ స్టంప్‌కి వెలుపల పడిన బంతుల్ని వెంటాడి వికెట్ సమర్పించుకున్నాడు. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యార్కర్ బంతిని ఆడలేక క్లీన్‌బౌల్డయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ 2 పరుగులకే ఔటయ్యాడు. పాదాలకి సమీపంలో పడిన బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి లెగ్, మిడిల్ స్టంప్‌లను గీరాటేసింది.

22 ఇన్నింగ్స్‌ల్లో 22.28 యావరేజితో 468 పరుగులు
ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ఐదు టెస్టుల సిరీస్ ఆరంభంలో విఫలమైన కేఎల్ రాహుల్ ఆఖరి టెస్టులో సెంచరీతో రాణించాడు. విండిస్‌తో ఆ తర్వాత జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో సెలక్టర్లు అవకాశమివ్వగా మళ్లీ విఫలమయ్యాడు. ఈ ఏడాది కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 22 ఇన్నింగ్స్‌ల్లో 22.28 యావరేజితో 468 పరుగులు చేశాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్ ఈ ఏడాది అత్యంత తక్కువ పరుగులు నమోదు చేశాడు.

మండిపడుతోన్న క్రికెట్ అభిమానులు
ఈ ఏడాది ఇప్పటివరకు కోహ్లీ అత్యుత్తమ ఇన్నింగ్స్ అంటే బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ(54), ఇంగ్లాండ్ పర్యటనలో ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో చేసిన 149 పరుగులే కావడం విశేషం. కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శనపై క్రికెట్ అభిమానులు సైతం మండిపడుతున్నారు. ఈ ఓపెనర్‌కి ఇంకెన్ని అవకాశాలు ఇస్తారంటూ? బీసీసీఐ, భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications
