For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరిస్ 1-1తో సమం: పెర్త్ టెస్టులో భారత్ ఓటమికి గల కారణాలివే

India Vs Australia, 2nd Test Day 5: Reasons behind india loss perth test against australia

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. 287 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌ 140 పరుగులకే కుప్పకూలింది. 112/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరిరోజు బ్యాటింగ్‌ మొదలు పెట్టిన టీమిండియా కేవలం 28 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటైంది.

దీంతో 146 పరుగుల తేడాతో గెలిచిన ఆసీస్‌ 4 టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించిన టీమిండియా అదే ఊపును కొనసాగిస్తుందని అంతా భావించారు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించి విజయం సాధించింది. అయితే, రెండో టెస్ట్‌లో మాత్రం ఘోర పరాజయం పాలైంది.

రెండో టెస్టులో టీమిండియా ఓటమికి జట్టు కూర్పు, ఓపెనర్ల విఫలం, తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ విషయంలో అంపైర్‌ తప్పుడు నిర్ణయాలే కారణమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

 స్పిన్నర్‌ లేకపోవడం

స్పిన్నర్‌ లేకపోవడం

తొలి టెస్ట్‌లో రాణించిన స్పిన్నర్‌ అశ్విన్‌ గాయంతో రెండో మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో మరో స్పిన్నర్‌ రవీంద్ర జడేజాను తీసుకోకుండా కోహ్లీ పెద్ద తప్పు చేశాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు పెర్త్ పిచ్‌ను అంచనా వేసే విషయంలో కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రిలు పొరపాటు పడ్డారని అంటున్నారు. రెండో టెస్టు మ్యాచ్‌కి ముందు పెర్త్ పిచ్ పేస్‌కు పేస్‌కు అనుకూలిస్తుందని వార్తలు రావడంతో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. ఇది భారత్‌ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. మొదటి రెండు రోజులు పేస్‌కు అనకూలించిన పిచ్ ఆ తర్వాత స్పిన్‌కు కూడా అనుకూలంగా మారింది. ప్రత్యర్ధి జట్టులోని స్పిన్నర్ నాథన్‌ లియాన్‌ 8 వికెట్లతో చెలరేగడమే ఇందుకు నిదర్శనం.

వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం ఇదే విషయాన్ని

వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం ఇదే విషయాన్ని

ఇక ఒక్క బౌలింగ్‌లోనే కాదు.. అటు బ్యాటింగ్‌లోనూ టీమిండియా పెద్ద దెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత అందరూ బౌలర్లే కావడంతో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కూడా దూకుడుగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే, పంత్ తర్వాతి స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చి ఉంటే మరో మంచి భాగస్వామ్యంతో భారత్‌కు స్పల్ప ఆధిక్యమన్నా లభించేదని అంటున్నారు. భారత ఓటమి అనంతరం టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ విషయాన్నే చెప్పుకొచ్చాడు. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన షమీ సైతం ఒక స్పిన్నర్‌ ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

 అంఫైర్ తప్పుడు నిర్ణయం

అంఫైర్ తప్పుడు నిర్ణయం

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వికెట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం కూడా భారత్‌ కొంపముంచింది. హ్యాండ్స్‌కోంబ్‌ పట్టిన క్యాచ్‌తో వివాదాస్పద రీతిలో పెవిలియన్‌ చేరిన కోహ్లీ అప్పటికే సెంచరీతో భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. జట్టు స్కోరు 251 పరుగుల వద్ద కోహ్లీ(123) ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఈ వికెట్‌ అనంతరం మరో 32 పరుగుల్లోపే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దీంతో ఆతిథ్య జట్టు 43 పరుగులు ఆధిక్యం లభించింది. కోహ్లీ మరికొద్ది సేపు క్రీజులో ఉంటే రిషబ్ పంత్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉండేది. భారీ ఆధిక్యం సాధించకపోయినా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై పైచేయి సాధించేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సిరిస్‌లో ఓపెనర్ల విఫలం

ఈ సిరిస్‌లో ఓపెనర్ల విఫలం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌లు దారుణంగా విఫలమవుతుండటం భారత బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తక్కువ స్కోర్లకే ఓపెనర్లు వెనుదిరగడంతో తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాట్స్‌మెన్‌ తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. ఇది ప్రత్యర్ధి బౌలర్లకు వరంగా మారుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ 2 పరుగులు చేయగా.. మురళీ విజయ్‌ డకౌట్‌ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్‌ డకౌట్‌ కాగా.. మురళీ విజయ్‌ కేవలం 20 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. తొలి టెస్టులో సెంచరీతో రాణించిన పుజారా రెండో టెస్టులో (24, 4) దారుణంగా విఫలమయ్యాడు.

 కోహ్లీపై అతిగా ఆధారపడటం

కోహ్లీపై అతిగా ఆధారపడటం

కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత మ్యాచ్‌ చేజారినట్లు ఇతర ఆటగాళ్లు భావించడం కూడా భారత్‌కు ప్రతికూలంగా మారుతోంది. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో చివరి రోజున ఇదే నిరూపితమైంది. జట్టులోని మిగతా ఆటగాళ్లు కనీస పోరాట పటిమ ప్రదర్శించకుండా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 112/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరిరోజు బ్యాటింగ్‌ మొదలు పెట్టిన టీమిండియా కేవలం 28 పరుగులు మాత్రమే జోడించింది. హనుమ విహారి-పంత్‌ జోడీ కాసేపు క్రీజులో నిలబడినా పరుగులు మాత్రం రాలేదు. వీరిద్దరి జోడీ పెవిలియన్‌ చేరిన తర్వాత టెయిలెండర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఉమేశ్‌యాదవ్‌ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఇషాంత్‌, బుమ్రా డకౌట్‌గా వెనుదిరగటంతో టీమిండియా 140 పరుగులకే ఆలౌటైంది. కోహ్లీపైనే ఆధారపడటం కూడా భారత్‌కు అంతమంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

1
43624
Story first published: Tuesday, December 18, 2018, 12:17 [IST]
Other articles published on Dec 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+