13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్
దీంతో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పుజారా ఔటైన తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీ విరామ సమయానికి భారత్ 6.2 ఓవర్లకు గాను 18/2 స్థితిలో నిలిచింది. టీ విరామం అనంతరం మురళీ విజయ్-కోహ్లీల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది. అయితే వీరి జోడి 35 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లీ ఔటయ్యాడు.
మురళీ విజయ్‌ని బౌల్డ్ చేసిన నాథన్ లియాన్
నాథన్ లియాన్ బౌలింగ్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి కెప్టెన్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే నిలకడగా ఆడుతోన్న మురళీ విజయ్‌ని బౌల్డ్ చేసి భారత్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఆసీస్ 243 ఆలౌట్
నాలుగోరోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 132/4తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులు చేసి ఆలౌటైంది. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఇంతటి పెద్ద లక్ష్యాన్ని చేధించిన దాఖలా లేదు. దీంతో పెర్త్ టెస్టు ఫలితం ఎలా ఉండబోతుందోనని ఆసక్తికరంగా మారింది.
ఆరు వికెట్లు తీసిన షమీ
మరోవైపు పచ్చికతో కూడిన పిచ్ క్రమంగా బ్యాటింగ్‌కి కష్టంగా మారడం విశేషం. నాలుగో రోజైన సోమవారం ఆటలో భాగంగా ఆస్ట్రేలియా లంచ్ వరకూ కాస్త మెరుగ్గానే ఆడినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఆరు వికెట్లు సాధించగా, బూమ్రా మూడు, ఇషాంత్ శర్మ వికెట్ తీశాడు.


Click it and Unblock the Notifications












