Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia 2nd T20I: సిరిస్ సమం చేస్తారా లేక సమర్పిస్తారా?

India vs Australia 2nd T20I, Preview: Where to watch, timing, possible XI, live streaming

హైదరాబాద్: రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సిరిస్‌లో రెండో టీ20 బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో రెండో టీ20లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. సొంత గడ్డపై టీ20 సిరిస్‌ను సమం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు రెండో టీ20లో గెలిచి సొంత గడ్డపై జరిగిన ఓటమికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

ఫామ్‌లోకి రాహుల్

ఫామ్‌లోకి రాహుల్

గత కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తోన్న యువ ఆటగాడు కేఎల్ రాహుల్ విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఫామ్‌లోకి రావడం జట్టు తుది కూర్పునే మార్చివేసింది. విశాఖ లాంటి పిచ్‌పై రాహుల్ 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీంతో రెండో టీ20లో కూడా ఓపెనర్ రోహిత్ శర్మకు జోడీగా అతడికే అవకాశం దక్కేలా కనిపిస్తోంది. మరోవైపు తొలి టీ20లో తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరిన రోహిత్ శర్మ రెండో టీ20లో పుంజుకోవాల్సి ఉంది.

టీ20ల్లో రిషభ్‌ పంత్‌ పేలవ ప్రదర్శన

టీ20ల్లో రిషభ్‌ పంత్‌ పేలవ ప్రదర్శన

ఇక, టీ20ల్లో రిషభ్‌ పంత్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి టీ20లో కూడా అనవసర పరుగు కోసం రనౌట్‌ అయ్యాడు. అయితే, తొలి టీ20 అనంతరం కోహ్లీ చెప్పిన మాటలను చూస్తే వీరిద్దరికీ ఆస్ట్రేలియా సిరీస్‌లో ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. దీనిని బట్టి రెండో టీ20లో శిఖర్ ధావన్‌కు సెలక్టర్లు మొండి చేయి చూపించనున్నారు.

దినేశ్‌ కార్తీక్‌కు ఇదే చివరి అవకాశం

దినేశ్‌ కార్తీక్‌కు ఇదే చివరి అవకాశం

వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా ఆడే చివరి సిరిస్ కావడంతో వరల్డ్ కప్‌కు ఎంపికయ్యే జట్టులో చోటు దక్కించుకొనేందుకు దినేశ్‌ కార్తీక్‌కు ఇదే చివరి అవకాశం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీసుల్లో మునుపటి బ్యాటింగ్‌తో అలరించిన ధోనీ విశాఖ టీ20లో అభిమానులను నిరాశపరిచాడు. దీంతో ధోని స్లో బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ సెటైర్లు వేశారు.

భారత బౌలింగ్ దళాన్ని నడిపించనున్న బుమ్రా

భారత బౌలింగ్ దళాన్ని నడిపించనున్న బుమ్రా

ఇక, బౌలర్ల విషయానికి వస్తే భారత పేస్ బౌలింగ్ దళాన్ని బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. రెండో టీ20లో బుమ్రా రెండు వికెట్లు తీస్తే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంటాడు. మరోవైపు తొలి టీ20 ఆఖరి ఓవర్‌లో 14 పరుగులను కాపాడలేకపోయిన ఉమేశ్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవచ్చు.

సిద్ధార్థ్‌ కౌల్‌ లేదా విజయ్‌ శంకర్‌

సిద్ధార్థ్‌ కౌల్‌ లేదా విజయ్‌ శంకర్‌

అతడి స్థానంలో యువ బౌలర్ సిద్ధార్థ్‌ కౌల్‌ లేదా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌‌లలో ఎవరినో ఒకరివైపు జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపొచ్చు. మయాంక్‌ మర్కండే స్థానానికి వచ్చిన ముప్పేమీ లేదు. ఇక, ఆసీస్‌ విషయానికి వస్తే తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. అయితే, తొలి టీ20లో టాపార్డర్ విఫలమైంది. మాక్స్‌వెల్‌, షార్ట్‌ మినహా మరెవ్వరూ రాణించలేదు. మ్యాక్స్‌వెల్ ఫామ్‌లో ఉండటం జట్టుకు సానుకూల అంశం.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

ఇండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్, ధోని, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సిద్దార్ధ్ కౌల్, యజువేంద్ర చాహల్

ఆస్ట్రేలియా:

ఆరోన్ ఫించ్, డీ ఆర్సీ షార్ట్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, నాథన్ కౌల్టర్-నైల్, జేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, నాథన్ లియాన్

మ్యాచ్ ప్రారంభం రాత్రి 7 గంటలకు

హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్

Story first published: Tuesday, February 26, 2019, 18:01 [IST]
Other articles published on Feb 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+