Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టీ20: టాస్ నెగ్గిన ఆసీస్, మూడు మార్పులతో బరిలోకి భారత్

India Vs Australia 2nd T20I, Live Updates: Finch wins toss, invites Kohli to bat; 3 changes for India

హైదరాబాద్: రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ ఇదే కావడం విశేషం.

తమ జట్టులో ఎటువంటి మార్పులు లేవని ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌ తెలిపాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్‌ శర్మ, మార్కండే, ఉమేశ్‌ యాదవ్‌లకు జట్టులో చోటు దక్కలేదు. వీరి స్థానంలో శిఖర్‌ ధావన్‌, విజయ శంకర్‌, సిద్ధార్థ కౌల్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఈ సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా లేక గెలిచిన అది రికార్డే. 2008 మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 మ్యాచ్ ఓడిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఇప్పటి దాకా ఓడిపోలేదు.

చివరిగా 2015లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోల్పోయింది. నాలుగేళ్ల నుంచి స్వదేశంలో జరిగినా ఏ సిరీస్‌ను టీమిండియా కోల్పోలేదు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ రికార్డు భారత క్రికెట్ జట్టు మరింతగా మెరుగుపరుచుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే 11 ఏళ్ల తర్వాత భారత్‌పై టీ20 సిరిస్‌ను గెలిచినట్లు అవుతుంది.

1
45584

ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం అశ్విన్ (52) వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 50 సిక్స్‌ల క్లబ్‌లో చేరడానికి కోహ్లీ రెండు సిక్స్‌ల దూరంలో ఉండగా.. ధోని ఒక్క సిక్స్ దూరంలో ఉన్నాడు.

మరోవైపు రోహిత్ శర్మ మరో సిక్స్ కొడితే అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డు నెలకొల్పుతాడు. రోహిత్ శర్మ 86 ఇన్నింగ్స్‌ల్లో 102 సిక్స్‌లు బాదగా.. గప్టిల్ (74 ఇన్నింగ్స్‌ల్లో 103 సిక్స్‌లు), క్రిస్ గేల్ (52 ఇన్నింగ్స్‌ల్లో 103 సిక్స్‌లు) ఈ జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

Story first published: Wednesday, February 27, 2019, 19:03 [IST]
Other articles published on Feb 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+