మెల్‌బోర్న్‌లో రెండో టీ20: టాస్ గెలిచిన భారత్, మార్పుల్లేకుండానే బరిలోకి


హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా మరో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో ఈ మ్యాచ్ కోహ్లీసేనకు ఇది చావోరేవో కానుంది.
టోర్నీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెండో టీ20లో స్వల్ప మార్పులు ఉంటాయని అంతా భావించారు. అయితే, కోహ్లీ మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.
తుది జట్టులో ఒక మార్పు చేసిన ఆస్ట్రేలియా
మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం తుది జట్టులో ఒక మార్పు చేసింది. గాయపడిన బిల్లీ స్టాన్‌లేక్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. ఈ సిరిస్‌లో ఇప్పటికే 1-0తో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా రెండో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా... ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి మూడు టీ20ల సిరీస్‌ని 1-1తో సమం చేయాలని భారత్ పట్టుదలతో ఉంది.
వర్షం అంతరాయం కలిగించే అవకాశం
ఇక, ఆస్ట్రేలియా జట్టులో హిట్టర్లు క్రిస్‌లిన్, మాక్స్‌వెల్ సూపర్ ఫామ్‌లో ఉండగా బౌలింగ్‌లో ఆడమ్ జంపా, స్టాయినిస్ చక్కగా రాణిస్తున్నారు. దీంతో వరుసగా రెండో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకోవాలని ఆతిథ్య జట్టు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌కీ వర్షం అంతరాయం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆసీస్ గడ్డపై టీ20ల్లో భారత్‌దే పైచేయి
ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు 16టీ20లాడిన భారత్ జట్టు ఏకంగా పది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో ఆసీస్ విజయం సాధించింది. ఇక, ఆసీస్ గడ్డపైన ఇరు జట్లు ఏడు టీ20లు ఆడగా, అందులోనూ నాలుగింట భారత్ విజయం సాధించింది.
భారత్ తుది జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్
ఆస్ట్రేలియా తుది జట్టు:
అరోన్ ఫించ్ (కెప్టెన్), క్రిస్ లిన్,డీఆర్క్ షార్ట్, బెన్ మెక్‌డెర్మాట్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, బెరెన్‌డార్ఫ్, అలెక్స్ కేరీ, నాథన్ కౌల్టర్ నైల్ , ఆండ్రూ టై, ఆడమ్ జంపా
సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్
మధ్యాహ్నాం 1.20 గంటలకు
లైవ్ స్ట్రీమింగ్:
సోనీ లైవ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications