మెల్‌బోర్న్‌లో రెండో టీ20: వర్షంతో నిలిచిన మ్యాచ్, ఆసీస్ 132/7

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20కి వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. 19వ ఓవర్ ముగిసిన తర్వాత చినుకులు కాస్త భారీ వర్షంగా మారడంతో ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఆసీస్ జట్టు 132 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెన్ మెక్‌డెర్మాట్ (32), ఆండ్రూ టై (12) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ టోర్నీలో వర్షం కారణంగా మ్యాచ్ నిలవడం ఇది రెండోసారి కావడం విశేషం.
అంతకముందు బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లోనూ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో టీమిండియాకు 17 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications