For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

19 ఓవర్లకు రెండో టీ20 కుదింపు: ఆస్ట్రేలియా 132... భారత్ టార్గెట్ 137

India vs Australia 2nd T20 : India To Chase 137 Runs From 19 Overs | Oneindia Telugu
India vs Australia 2nd T20I Live Score: India Need 137 To Win In 19 Overs

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియాకు ఆతిథ్య జట్టు 137 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో అంఫైర్లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. 19వ ఓవర్‌ ముగిసిన తర్వాత చినుకులు కాస్త భారీ వర్షంగా మారడంతో ఆటకు విరామం ప్రకటించారు.

వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఆసీస్ జట్టు 132 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసినట్లుగా అంఫైర్లు ప్రకటించారు. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా విజయ లక్ష్యాన్ని 137 పరుగులుగా నిర్ధారించారు. భారత బౌలర్లలో భువీ, ఖలీల్ రెండు వికెట్లు తీసుకోగా... బుమ్రా, కుల్దీప్, పాండ్యా తలో వికెట్ తీశారు.

1
43621

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెలరేగిన భారత బౌలర్లు

ఈ సిరిస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేయకుండా భలేగా కట్టడి చేశారు. ఇక, తొలి టీ20లో చెత్త ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను చేజార్చుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టారు. వైవిధ్యమైన బంతుల విసరడంతో ఆతిథ్య జట్టులో ఒక్కరు మినహా ఎవ్వరూ 20 పరుగులు చేయలేదు. బెన్‌ మెక్‌డెర్మాట్‌ (32) ఒక్కడే టాప్‌ స్కోరర్‌‌గా నిలిచాడు. మెక్‌డెర్మాట్ వల్లే ఆస్ట్రేలియా 130 పరుగుల మార్క్‌ని అందుకోగలిగింది.

తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టిన భువనేశ్వర్

ఓవైపు వికెట్లు పడుతున్నా క్రీజులో ఉండి పోరాడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను తొలి ఓవర్‌లోనే భువనేశ్వర్ కుమార్ దెబ్బకొట్టాడు. ఆ తర్వాత ఖలీల్‌ అహ్మద్‌ 27 వద్ద క్రిస్‌లిన్‌ (13)ను, జట్టు స్కోరు 35 పరుగుల వద్ద డీఆర్సీ షార్ట్‌ (14)ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ (4)ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 41/4తో నిలిచింది. ఎక్కువ పరుగులు చేయాలన్న ఉద్దేశంతో భారీ షాట్లకు ప్రయత్నించి బ్యాట్స్‌మెన్‌ వికెట్లు కోల్పోయారు.

వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిన ఆస్ట్రేలియా

దీంతో ఆసీస్‌ ఒత్తిడిలో పడింది. కుల్దీప్‌, కృనాల్‌ తమ స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా కట్టడి చేశారు. తొలి టీ20లో పరుగుల వరద పారించిన గ్లెన్ మాక్స్‌వెల్‌ (19)ను పాండ్యా, అలెక్స్‌ కారె (4)ను కుల్దీప్‌ ఔట్ చేశారు. కౌల్టర్‌ నైల్‌ (18) రెండు భారీ సిక్సర్లతో బెంబేలెత్తించినా అతడిని భువి పెవిలియన్‌కు చేర్చాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఖలీల్ బౌలింగ్‌లో ఆసీస్ 19 పరుగులు 19వ ఓవర్లో బుమ్రా 10 పరుగులు ఇవ్వడంతో స్కోరు పెరిగింది. 17వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం.

వర్షం వల్ల దాదాపు గంటకు పైగా సమయం వృథా

వర్షం వల్ల దాదాపు గంటకు పైగా సమయం వృథా

19 ఓవర్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. 19 ఓవర్లకు ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. వర్షం వల్ల దాదాపు గంటకు పైగా సమయం వృథాకావడంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ఈ టోర్నీలో వర్షం కారణంగా మ్యాచ్ నిలవడం ఇది రెండోసారి కావడం విశేషం. అంతకముందు బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లోనూ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో టీమిండియాకు 17 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Story first published: Friday, November 23, 2018, 16:07 [IST]
Other articles published on Nov 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+