న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia 2nd T20I: మాక్స్‌వెల్ ‘హ్యాట్రిక్ సిక్సర్ల’కి బదులు తీర్చుకున్న పాండ్యా

India vs Australia 2nd T20 : Krunal Pandya Clean Bowls Glenn Maxwell, Video Goes Viral | Oneindia
India vs Australia 2nd T20I Live Score: Glenn Maxwell dismissed by Krunal Pandya

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో ఈ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా పోటాపోటీగా బంతులు వేస్తున్నారు. ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నారు. తొలి టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న కృనాల్ పాండ్యా ఈ మ్యాచ్‌లో చెలరేగుతున్నాడు.

1
43621

బదులు తీర్చుకున్న పాండ్యా

బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ బ్యాట్స్‌మన్ మాక్స్‌వెల్ ‘హ్యాట్రిక్ సిక్సర్ల'కి ఈ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా బదులు తీర్చుకున్నాడు. కృనాల్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఆఖరి బంతికి మ్యాక్స్ వెల్ (19) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ ఔట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. పాండ్యా వేసిన బంతిని ఆడే క్రమంలో మ్యాక్స్‌వెల్ బ్యాట్‌ని అడ్డుపెట్టినప్పటికీ, అది గిర్రున తిరుగుతూ వికెట్లను గిరాటేసింది.

ట్విట్టర్‌లో పోస్టు చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా

ట్విట్టర్‌లో పోస్టు చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఇందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే, తొలి టీ20లో పాండ్యా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌లో మొత్తం నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

తొలి టీ20లో 4 ఓవర్లు వేసిన 55 పరుగులిచ్చిన పాండ్యా

తొలి టీ20లో 4 ఓవర్లు వేసిన 55 పరుగులిచ్చిన పాండ్యా

తొలి టీ20లో పాండ్యా తన 4 ఓవర్ల వేసి 55 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో రెండో టీ20 తుది జట్టులో పాండ్యా స్థానంలో చాహల్‌కు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం ఆ మాటలను ఏమీ పట్టించుకోకుండా తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.

రెండో టీ20లో వరుణుడు అంతరాయం

రెండో టీ20లో వరుణుడు అంతరాయం

కాగా, రెండో టీ20కి వరుణుడు ఆటంకం కలిగించాడు. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనూ 19వ ఓవర్‌ ముగిసిన తర్వాత చినుకులు కాస్త భారీ వర్షంగా మారడంతో ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు. వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి ఆస్ట్రేలియా 132/7తో ఉంది. బెన్‌ మెక్‌డెర్మాట్‌ (32), ఆండ్రూ టై (12) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి టీ20లో సరిగ్గా 17 ఓవర్‌ సమయంలో వరుణుడు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, November 23, 2018, 15:23 [IST]
Other articles published on Nov 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X