For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2nd T20I: కోహ్లీ హాఫ్ సెంచరీ, ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 191

India vs Australia 2nd T20I Live Cricket Score: Virat Kohli Leads India To 190/4 Against Australia

హైదరాబాద్: బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 72, 2 ఫోర్లు, 6 సిక్సులు), ధోని(23 బంతుల్లో 40, 3 ఫోర్లు, 3 సిక్సులు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో బెహ్రండోర్ఫ్, నాథన్ కౌల్టర్-నైల్, కమిన్స్ డీ ఆర్సీ షార్ట్ తలో వికెట్ తీసుకున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ ఓడి బ్యాటింగ్

టాస్ ఓడి బ్యాటింగ్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడు ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌, చివర్లో ధోని మెరుపులు జతకావడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రాహుల్‌, శిఖర్‌ ధావన్‌ చక్కటి శుభారంభం అందించారు. దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 61 పరుగుల వద్ద కేఎల్ రాహుల్‌(26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అవుటయ్యాడు.

రిషబ్ పంత్ స్వల్ప స్కోరుకే

రిషబ్ పంత్ స్వల్ప స్కోరుకే

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(1) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరి నిరాశపరచగా... మరో ఓపెనర్ శిఖర్ ధావన్(14) వెంట వెంటనే పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు 150 పరుగులు దాటింది.

టి20ల్లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెంచరీ

టి20ల్లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెంచరీ

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 4 సిక్సర్లు, ఫోర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెచంరీ. ఇక, విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో నెమ్మదిగా ఆడి విమర్శలు పాలైన ధోని ఈ ​ మ్యాచ్‌లో దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో ధోని 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో ఔటయ్యాడు.

దూకుడుగా ఆడిన ధోని

దూకుడుగా ఆడిన ధోని

మరోవైపు విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఈ సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా లేక గెలిచిన అది రికార్డే.

టీమిండియా ఓడినా గెలిచినా రికార్డే

టీమిండియా ఓడినా గెలిచినా రికార్డే

2008 మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 మ్యాచ్ ఓడిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఇప్పటి దాకా ఓడిపోలేదు. చివరిగా 2015లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోల్పోయింది. నాలుగేళ్ల నుంచి స్వదేశంలో జరిగినా ఏ సిరీస్‌ను టీమిండియా కోల్పోలేదు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ రికార్డు భారత క్రికెట్ జట్టు మరింతగా మెరుగుపరుచుకుంటుంది.

బుమ్రా మరో 2 వికెట్లు తీస్తే

బుమ్రా మరో 2 వికెట్లు తీస్తే

ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే 11 ఏళ్ల తర్వాత భారత్‌పై టీ20 సిరిస్‌ను గెలిచినట్లు అవుతుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం అశ్విన్ (52) వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 6 సిక్సులు బాదడంతో, ధోని 3 సిక్సులు బాదడంతో 50 సిక్స్‌ల క్లబ్‌లో చేరారు.

1
45584
Story first published: Wednesday, February 27, 2019, 21:08 [IST]
Other articles published on Feb 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+