మ్యాక్స్‌వెల్ 113 నాటౌట్: రెండో టీ20లో ఆసీస్ విజయం, 11 ఏళ్ల తర్వాత సిరిస్ కైవసం


హైదరాబాద్: బెంగళూరు వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 191 పరుగుల విజయా లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (113నాటౌట్; 55బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సులు) సెంచరీతో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో రెండు టీ20ల సిరిస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో 11 ఏళ్ల తర్వాత భారత్‌పై టీ20 సిరిస్‌ను గెలిచినట్లు అయింది. 2008 మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 మ్యాచ్ ఓడిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఇప్పటి దాకా ఓడిపోలేదు. చివరిగా 2015లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోల్పోయింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో కోహ్లీసేన టీ20 సిరీస్‌ను కోల్పోయింది.
మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు
భారత్ నిర్దేశించిన 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మ్యాక్స్‌వెల్(113 నాటౌట్) సెంచరీకి తోడు డీఆర్సీ షార్ట్(40)లు రాణించడంతో అలవోక విజయాన్ని నమోదు చేసింది. గతకొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న మ్యాక్స్‌వెల్ ఈ సిరిస్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు రెండో టీ20లో సెంచరీ సాధించిన మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు లభించాయి.

టాస్ ఓడి బ్యాటింగ్
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీకి తోడు ఓపెనర్ కేఎల్ రాహుల్, చివర్లో ధోని మెరుపులు జతకావడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధావన్ చక్కటి శుభారంభం అందించారు. దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 61 పరుగుల వద్ద కేఎల్ రాహుల్(26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అవుటయ్యాడు.

రిషబ్ పంత్ స్వల్ప స్కోరుకే
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(1) స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరి నిరాశపరచగా... మరో ఓపెనర్ శిఖర్ ధావన్(14) వెంట వెంటనే పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు 150 పరుగులు దాటింది.

టి20ల్లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెంచరీ
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 4 సిక్సర్లు, ఫోర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ టి20ల్లో కోహ్లీకి ఇది 20వ హాఫ్ సెచంరీ. ఇక, విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో నెమ్మదిగా ఆడి విమర్శలు పాలైన ధోని ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో ధోని 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో ఔటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications