For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2nd T20I: బెంగళూరులో ఆసీస్ 11 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టేనా?

India vs Australia, 2nd T20I: Can Aaron Finch and Co break their 11-year-long streak in Bengaluru?

హైదరాబాద్: రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి 7 గంటలకు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఈ సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే, రెండో టీ20కి ఆతిథ్యమిస్తోన్న చిన్నస్వామి స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 ఇదే కావడం విశేషం.

ఈ స్టేడియంలో ఇదే మొదటిసారి

ఈ స్టేడియంలో ఇదే మొదటిసారి

చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇదే స్టేడియంలో ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా లేక గెలిచిన అది రికార్డే.

భారత్ ఇప్పటి దాకా ఓడిపోలేదు

భారత్ ఇప్పటి దాకా ఓడిపోలేదు

2008 మెల్‌బోర్న్‌లో జరిగిన టీ20 మ్యాచ్ ఓడిన తర్వాత ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఇప్పటి దాకా ఓడిపోలేదు. దీంతో పాటు స్వదేశంలో చివరిగా 2015లో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోల్పోయింది. నాలుగేళ్ల నుంచి స్వదేశంలో జరిగినా ఏ సిరీస్‌ను టీమిండియా కోల్పోలేదు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆ రికార్డు భారత క్రికెట్ జట్టు మరింతగా మెరుగుపరుచుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే 11 ఏళ్ల తర్వాత భారత్‌పై టీ20 సిరిస్‌ను గెలిచినట్లు అవుతుంది.

స్వల్ప మార్పులతో బరిలోకి

స్వల్ప మార్పులతో బరిలోకి

ఈ మ్యాచ్‌లో భారత జట్టు స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. ప్రపంచకప్‌ ముంగిట రొటేషన్‌ విధానాన్ని అనుసరిస్తున్న భారత్‌.. తొలి మ్యాచ్‌కు శిఖర్‌ ధావన్‌కు విశ్రాంతినిచ్చింది. రెండో టీ20లో ధావన్‌ని ఆడించే అవకాశముంది. తొలి టీ20లో సత్తా చాటిన కేఎల్‌ రాహుల్‌కు మరిన్ని అవకాశాలివ్వాలని భావిస్తున్న నేపథ్యంలో ఈసారి రోహిత్‌కు విశ్రాంతినిచ్చి ధావన్‌ను ఆడిస్తారని సమాచారం.

విజయ్‌ శంకర్‌ అవకాశం!

విజయ్‌ శంకర్‌ అవకాశం!

దినేశ్‌ కార్తీక్‌, రిషబ్‌ పంత్‌ల్లో ఒకరిని పక్కన పెట్టి ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఆడించే అవకాశాన్ని కూడా జట్టు మేనేజ్‌మెంట్ పరిశీలిస్తుంది. వైజాగ్‌ టీ20లో విఫలమైన ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో సిద్దార్థ్‌ కౌల్‌ను తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. తొలి టీ20లో టాపార్డర్ విఫలం కావడంతో రెండో టీ20లో సమష్టిగా సత్తా చాటాలని భారత్‌ భావిస్తోంది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

ఇండియా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్, ధోని, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సిద్దార్ధ్ కౌల్, యజువేంద్ర చాహల్

ఆస్ట్రేలియా:

ఆరోన్ ఫించ్, డీ ఆర్సీ షార్ట్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, నాథన్ కౌల్టర్-నైల్, జేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, నాథన్ లియాన్

మ్యాచ్ ప్రారంభం రాత్రి 7 గంటలకు

హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్

Story first published: Wednesday, February 27, 2019, 16:46 [IST]
Other articles published on Feb 27, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+