For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia 2nd T20I: వర్షం దెబ్బకు మ్యాచ్ రద్దు

India vs Australia 2nd T20I : Match Called Off Due To Rain, Hosts Lead Series 1-0
India vs Australia 2nd T20I Called Off Due To Rain. Hosts Lead Series 1-0

హైదరాబాద్: మెల్‌బోర్న్ టీ20ని వరుణుడు వదిలిపెట్టకపోవడంతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 రద్దు అయింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌ను సమం చేయాలంటే చివరి మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధించాల్సిందే.

వర్షం కారణంగా ఆట రద్దు అవడం అభిమానులను నిరాశపరిచింది. మ్యాచ్‌ను తొలుత 19 ఓవర్లకు కుదించిన అంపైర్లు వర్షం తెరిపినివ్వకపోవడంతో మరోమారు ఓవర్లు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.

వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసినట్లుగా అంఫైర్లు ప్రకటించారు. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా విజయ లక్ష్యాన్ని 137 పరుగులుగా నిర్ధారించారు. టీమిండియా ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మైదానంలోకి అడుగుపెట్టారు.

1
43621

తొలుత భారత్ లక్ష్యాన్ని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించిన అంఫైర్లు

ఈ క్రమంలో మరోమారు వర్షం కురిసింది. దీంతో మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్లను అలాగే ఉంచారు. ఆ తర్వాత వర్షం కాసేపు తగ్గుముఖం పట్టడం, ఆటగాళ్లు మైదానంలోకి రావడం, మళ్లీ వర్షం రావడం జరిగింది. దీంతో భారత లక్ష్యాన్ని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించారు. వర్షం ఆగితే స్థానిక కాలమానం ప్రకారం 22:02 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమైతే కోహ్లీసేన 5 ఓవర్లకు 46 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చేది.

వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోతే

వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోతే

ఆ తర్వాత వర్షం ఎంతకీ తగ్గుముఖం పట్టకపోతే అంఫైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ టోర్నీలో వర్షం కారణంగా మ్యాచ్ నిలవడం ఇది రెండోసారి కావడం విశేషం. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లోనూ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచింది. దీంతో దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో భారత్‌కు 17 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

తొలి టీ20లో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి

తొలి టీ20లో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి

ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి ఓవర్‌లోనే భువనేశ్వర్ కుమార్ దెబ్బకొట్టాడు. ఆ తర్వాత ఖలీల్‌ అహ్మద్‌ 27 వద్ద క్రిస్‌లిన్‌ (13)ను, జట్టు స్కోరు 35 పరుగుల వద్ద డీఆర్సీ షార్ట్‌ (14)ను ఔట్‌ చేశాడు.

 7 ఓవర్లు ముగిసే సరికి 41/4తో నిలిచిన ఆసీస్‌

7 ఓవర్లు ముగిసే సరికి 41/4తో నిలిచిన ఆసీస్‌

ఆ తర్వాత కాసేపటికే ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ (4)ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 41/4తో నిలిచింది. ఎక్కువ పరుగులు చేయాలన్న ఉద్దేశంతో భారీ షాట్లకు ప్రయత్నించి బ్యాట్స్‌మెన్‌ వికెట్లు కోల్పోయారు. దీంతో ఆసీస్‌ ఒత్తిడిలో పడింది. కుల్దీప్‌, కృనాల్‌ తమ స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా కట్టడి చేశారు.

17వ ఓవర్‌లో 2 పరుగులిచ్చిన బుమ్రా

17వ ఓవర్‌లో 2 పరుగులిచ్చిన బుమ్రా

తొలి టీ20లో పరుగుల వరద పారించిన గ్లెన్ మాక్స్‌వెల్‌ (19)ను పాండ్యా, అలెక్స్‌ కారె (4)ను కుల్దీప్‌ ఔట్ చేశారు. కౌల్టర్‌ నైల్‌ (18) రెండు భారీ సిక్సర్లతో బెంబేలెత్తించినా అతడిని భువి పెవిలియన్‌కు చేర్చాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఖలీల్ బౌలింగ్‌లో ఆసీస్ 19 పరుగులు 19వ ఓవర్లో బుమ్రా 10 పరుగులు ఇవ్వడంతో స్కోరు పెరిగింది. 17వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 2 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం.

19 ఓవర్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి

19 ఓవర్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి

19 ఓవర్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. 19 ఓవర్లకు ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిన దశలో వర్షం కురవడంతో ఆట ఆగిపోయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, ఖలీల్ చెరో రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, కుల్‌దీప్, కృనాల్ తలా ఒక వికెట్ తీశారు.

Story first published: Friday, November 23, 2018, 17:15 [IST]
Other articles published on Nov 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+