
రాబోయే భారత్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. మొహాలీలో మొదటి టీ20 సెప్టెంబర్ 20న జరగనుంది. తర్వాత నాగ్‌పూర్ & హైదరాబాద్‌లలో 2వ 3వ టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. మొహాలీ టిక్కెట్ల విక్రయం సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. నాగ్‌పూర్‌లో 23న జరిగే 2వ టీ20 టిక్కెట్ల విక్రయాలకు సంబంధించి నేటి నుంచి ఆన్‌లైన్ సైన్ అప్ టిక్కెట్ విండో తెరుచుకుంటుంది. అయితే ఇది టికెట్లు ఎప్పుడూ రిలీజ్ అవుతాయో తెలిపే అప్డేటెడ్ ఫ్రీ టికెట్. ఇక మ్యాచ్ టికెట్లు మాత్రం 18వ తేదీ రిలీజ్ అవుతాయి.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 20న మొహాలీలోని ఐకానిక్ IS బింద్రా పీసీఏ స్టేడియంలో జరుగుతుంది. 2వ టీ20 సెప్టెంబర్ 23న నాగ్‌పూర్‌లోని జమ్తాలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ స్టేడియం దేశంలోనే అత్యుత్తమ క్రికెట్ సౌకర్యాలను కలిగి ఉన్న స్టేడియంగా పేరొందింది. వీసీఏ స్టేడియం వివిధ దేశీయ టోర్నమెంట్‌ల కోసం విదర్భ క్రికెట్ జట్టు, సెంట్రల్ జోన్ జట్టుకు హోమ్ గ్రౌండ్. 18న ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తెరుచుకుంటాయి.
ఆఫ్‌లైన్ టిక్కెట్లు మాత్రం మ్యాచ్ ముందు రోజు లేదా మ్యాచ్ రోజు స్టేడియం వద్ద అందుబాటులోకి వస్తాయి. ఇక ఈ టిక్కెట్లు బీసీసీఐ అధికారిక ప్లాట్‌ఫారమ్‌లో అలాగే PayTM ఇన్‌సైడర్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే పేటీఎం ఇన్ సైడర్లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉందంటూ నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. సరైన విధంగా టికెట్ల ఇన్ఫర్మేషన్ లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయి.
విధర్భలో టీ20 టిక్కెట్లలో సెపరేట్ స్టుడెంట్ కోటా కూడా ఉంది. అయితే ఇవి కేవలం స్టేడియం కౌంటర్‌లలో మాత్రమే అమ్మకానికి ఉంటాయి.
విద్యార్థులు తమ పాఠశాల లేదా కళాశాల గుర్తింపు కార్డులను చూపించినట్లయితే వారు రాయితీ టికెట్ పొందుతారు. వారి టికెట్ ధర రూ.300 లేదా రూ.100 అనేది తెలియాల్సి ఉంది. ప్రత్యేక ప్రతిభావంతులకు రూ.100కే టికెట్ లభిస్తుంది. విద్యార్థులు, ప్రత్యేక ప్రతిభావంతులకు మొత్తం 4400టికెట్లు కేటాయించారు. ఇక స్టేడియం కెపాసిటీ మొత్తం 44000. ఇకపోతే టికెట్ ధరలు ఏడు కేటగిరీల్లో ఉన్నాయి. అత్యధిక శ్రేణి టిక్కెట్ ధర రూ.10,000గా ఉంది. అయితే ఇతర సాధారణ టికెట్ ధరలు రూ.1000 నుంచి రూ.1500 వరకు ఉన్నాయి.