స్మిత్ మెరుపు సెంచరీ.. చెల‌రేగిన వార్న‌ర్‌, మ్యాక్స్‌వెల్.. భారత్ టార్గెట్ 390!!

సిడ్నీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలోనూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెల‌రేగిపోయారు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మెరుపు సెంచ‌రీకి (104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులు‌) తోడు ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌ (83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు‌), ఆరోన్ ఫించ్‌ (60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలు చేశారు.

చివరలో మార్నస్ లబుషేన్ (70; 61 బంతుల్లో 5 ఫోర్లు‌) ‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు‌) అర్ధ శతకాలు సాధించ‌డంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 389 రన్స్ చేసి.. భారత్ ముందు 390 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ధాటికి టీమిండియా బౌల‌ర్లు మ‌రోసారి భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. బుమ్రా అత్య‌ధికంగా 79, షమీ 73, చహ‌ల్ 71, సైనీ 70, జ‌డేజా 60 ప‌రుగులు ఇచ్చారు.

తొలి వికెట్‌కు 142 పరుగులు

తొలి వికెట్‌కు 142 పరుగులు

టాస్ గెలిచిన ఆరోన్ ఫించ్ మరోసారి బ్యాటింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కంగారూ బ్యాట్స్‌మెన్ జోరుకు అస‌లు అడ్డే లేకుండా పోయింది. ఓపెనర్లు ఫించ్, వార్నర్ బౌండరీలు, సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తొలి వన్డేను తలపించేలా ఈ మ్యాచ్‌లో వీరి బ్యాటింగ్ సాగింది. వార్నర్-ఫించ్ జోడి తొలి వికెట్‌కు 142 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీలు బాదారు. 60 పరుగులు చేసిన ఫించ్‌ను షమీ ఔట్ చేయగా.. వార్నర్‌ (83)ను అయ్యర్ రనౌట్ చేశాడు.

62 బంతుల్లోనే స్మిత్ సెంచరీ

62 బంతుల్లోనే స్మిత్ సెంచరీ

ఫించ్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టీవ్ స్మిత్ మరోసారి సత్తా చాటాడు. మొదటి వన్డే తరహాలోనే 62 బంతుల్లోనే స్మిత్ సెంచరీ బాదాడు. స్మిత్ బౌండరీల మోత మోగించాడు. ఇక తొలి మ్యాచ్‌లో విఫలమైన లబుషేన్ (70) ఈ మ్యాచ్‌లో మెరిశాడు. మొదటిలో నెమ్మదిగా ఆడినా.. కుదురుకున్నాక బ్యాట్ జులిపించాడు. మరో ఎండ్‌లో దూకుడుగా ఆడిన మ్యాక్స్‌వెల్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 45 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. దీంతో ఆసీస్ భారత్ ముందు 390 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

తేలిపోయిన టీమిండియా బౌల‌ర్లు

తేలిపోయిన టీమిండియా బౌల‌ర్లు

ఆసీస్ బ్యాట్స్‌మెన్ ధాటికి టీమిండియా బౌల‌ర్లు మ‌రోసారి భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఎంతకీ ఔటవ్వకపోవడంతో.. కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యాలతో బౌలింగ్ చేయించాడు. ఫిట్‌నెస్ కారణాల రీత్యా బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్.. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులిచ్చి పర్వాలేదనిపించాడు. సైనీ 7 ఓవర్లలోనే 70 పరుగులు ఇచ్చుకోగా.. చహల్ 9 ఓవర్లలో 71 రన్స్ సమర్పించుకున్నాడు. జడేజా 10 ఓవర్లలో 60 పరుగులిచ్చాడు. షమీ 9 ఓవర్లలో 73 పరుగులు.. బుమ్రా 10 ఓవర్లలో 79 రన్స్ ఇచ్చాడు.

ఫిలిప్స్ రికార్డ్ సెంచరీ.. రెండో టీ20లో కివీస్‌ ఘన విజయం.. ఆర్సీబీ కన్ను!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Sunday, November 29, 2020, 13:26 [IST]
Other articles published on Nov 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X