Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: అయ్యర్‌.. వాట్‌ ఏ త్రో!! వార్నర్‌ రనౌట్!

India vs Australia 2nd ODI: Shreyas Iyer’s direct hit to Run out David Warner
Ind vs Aus 2nd ODI : Shreyas Iyer’s Direct Hit To Dismiss David Warner

సిడ్నీ: ఇండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలోనూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ చెల‌రేగిపోయారు. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మన్‌ వచ్చినట్లే దంచికొట్టడంతో భారత్‌పై ఆస్ట్రేలియా మరోసారి అత్యధిక స్కోర్‌ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసింది. స్టీవ్ ‌స్మిత్‌ (104; 64 బంతుల్లో 14x4, 2x6) మెరుపు శతకంతో పాటు టాప్‌ ఆర్డర్‌ మొత్తం చెలరేగారు. ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (83; 77 బంతుల్లో 7x4, 3x6), కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (60; 69 బంతుల్లో 6x4, 1x6) అర్ధ శతకాలతో శుభారంభం చేయగా.. తర్వాత వచ్చిన మార్నస్‌ లబుషేన్‌ (70; 61 బంతుల్లో 5x4), గ్లెన్ మాక్స్‌వెల్‌ (63; 29 బంతుల్లో 4x4, 1x6) కూడా భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు.

మొదటి వన్డేలో అర్థ సెంచరీ సాధించి మంచి ఫామ్‌లో ఉన్న డేవిడ్‌ వార్నర్‌ రెండో వన్డేలోనూ అదే జోరు కనబరిచాడు. వరుసగా రెండో అర్థ సెంచరీ సాధించిన వార్నర్..‌ ఈ మ్యాచ్‌లో వేగంగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలోనే 77 బంతుల్లో 83 పరుగులు చేసిన వార్నర్..‌ శ్రేయాస్ అయ్యర్ వేసిన అద్భుతమైన త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. జాడేజా వేసిన ఇన్నింగ్స్ 25.3వ ఓవర్లో బౌలర్ మీదుగా బంతిని బాదిన స్మిత్.. ఒక పరుగు పూర్తిచేశాడు. బంతి అయ్యర్ దగ్గరకు వెళ్లిందని తెలిసినా.. వార్నర్ సెకండ్ రన్ కోసం వేగంగా పరిగెత్తే ప్రయత్నం చేశాడు. కానీ లాంగ్ ఆఫ్ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్.. బంతిని నేరుగా వికెట్లపైకి విసరడంతో వార్నర్ రనౌటయ్యాడు.

అంతకు ముందు 14.1వ ఓవర్లో డేవిడ్ వార్నర్ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ బౌలింగ్‌లో వార్నర్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. అయ్యర్ బంతిని కీపర్ రాహుల్‌ వైపు విసిరాడు. రాహుల్ వికెట్లను గిరాటేసే లోపే వార్నర్ డైవ్ చేస్తూ క్రీజ్‌లో బ్యాట్ పెట్టాడు. అలా ఓసారి అయ్యర్ చేతిలో రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వార్నర్.. రెండోసారి మాత్రం అద్భుత త్రోకు అంపైర్ ఔటివ్వక ముందే పెవిలియన్ బాట పట్టాడు.

డేవిడ్ వార్నర్‌ను శ్రేయాస్ అయ్యర్‌ రనౌట్‌ చేసిన తీరును ఐసీసీ ట్విటర్‌లో పంచుకుంది. అయ్యర్‌ త్రోను పొగుడుతూ 'వారెవ్వా అయ్యర్‌.. వాట్‌ ఏ త్రో' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఫాన్స్ కూడా అయ్యర్ ఫీల్డింగ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (30), మయాంక్ అగర్వాల్ (28) నిరాశపరిచారు. భారత్ 9 ఓవర్లలో 61 పరుగులు చేసింది. కోహ్లీ (0), అయ్యర్ (1) క్రీజులో ఉన్నారు.

Story first published: Sunday, November 29, 2020, 14:29 [IST]
Other articles published on Nov 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+