3 వేల పరుగులు పూర్తిచేసిన ధావన్-కోహ్లీ.. 10వ జోడిగా రికార్డు!!

రాజ్‌కోట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ టీమిండియా ఓపెనర్‌లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఆకట్టుకున్నారు. అయితే జట్టు స్కోర్ 81 పరుగుల దగ్గర హిట్‌మ్యాన్ 42 (44 బంతుల్లో ఆరు ఫోర్లు) పెవిలియన్ చేరాడు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి వన్డేలో 74 పరుగులు చేసిన ధావన్.. రెండో వన్డేలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు.

10 జోడిగా రికార్డు:
రోహిత్ పెవిలియన్ చేరినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ధావన్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ధావన్ తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో ధావన్ పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీతో కలిసి మూడు వేల వన్డే పరుగుల భాగస్వామ్యాన్ని ధావన్ సాధించాడు. మూడు వేల వన్డే పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన 40వ జోడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక భారత్ తరఫున 10 జోడిగా నిలిచారు.

మూడో అత్యుత్తమ యావరేజ్:
మూడు వేల వన్డే పరుగుల భాగస్వామ్యాన్ని ధావన్-కోహ్లీలు సాధించే క్రమంలో ఈ జోడి యావరేజ్ 62.50గా ఉంది. ఇది మూడో అత్యుత్తమ యావరేజ్. ఈ జాబితాలో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్-అషిమ్ ఆమ్లాలు తొలి స్థానంలో ఉన్నారు. వీరి యావరేజ్ 72.34 గా ఉంది. ఇక రెండో స్థానంలో టీమిండియా ప్లేయర్స్ రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ (64.06)ల జోడి ఉంది. కోహ్లీ రెండు భాగస్వామ్యాలలో ఉండడం విశేషం.

ధావన్ అర్ధ సెంచరీ:
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ను రోహిత్-శిఖర్ ధావన్‌లు ఘనంగా ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. రోహిత్ (42) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కాగా ధావన్ 96 పరుగుల వ్యక్తిగత పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై శ్రేయాస్ అయ్యర్ కూడా పెవిలియన్ చేరాడు.

కోహ్లీ ఔట్:
అయ్యర్ క్రీజు విడిచిపెట్టిన తర్వాత మైదానంలోకి వచ్చిన లోకేశ్ రాహుల్.. కోహ్లీతో కలిసి సమయోచితంగా ఆడాడు. రాహుల్ అండతో కోహ్లీ వన్డేల్లో 56వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే స్కోర్ వేగం పెంచే క్రమంలో 78 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అయితే క్రీజులో రాహుల్ ఉండడంతో 300 పైగా వెళ్లే అవకాశం ఉంది. 44 ఓవర్లు ముగిసే సరికి భారత్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్ (44), మనీష్ పాండే (2)లు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications